తమిళనటి విజయలక్ష్మి ఆత్మహత్యాయత్నం

ABN , First Publish Date - 2020-07-27T03:43:50+05:30 IST

తమిళనటి విజయలక్ష్మి ఆత్మహత్యాయత్నానికి పాల్పడ్డారు. సోషల్ మీడియాలో వేధింపులు, బెదిరింపుల

తమిళనటి విజయలక్ష్మి ఆత్మహత్యాయత్నం

చెన్నై: తమిళనటి విజయలక్ష్మి ఆత్మహత్యాయత్నానికి పాల్పడ్డారు. సోషల్ మీడియాలో వేధింపులు, బెదిరింపుల కారణంగానే తానీ నిర్ణయం తీసుకున్నట్టు అంతకుముందు ఆమె ఓ వీడియోలో  పేర్కొన్నారు. ‘నామ్ తమిళర్’ పార్టీ నేత సీమన్, ‘పన‌న్‌కట్టు పడై’కి చెందిన హరి నాడార్ ఫాలోవర్లు తనను వేధిస్తున్నట్టు పేర్కొంటూ విజయలక్ష్మి సోషల్ మీడియాలో పలు వీడియోలు విడుదల చేశారు. నేడు (ఆదివారం) ఫేస్‌బుక్‌లో ఓ వీడియో పోస్టు చేసిన విజయలక్ష్మి కొన్ని పిల్స్ తీసుకుంటే రక్తపోటు తగ్గిపోయి మరణం సంభవిస్తుందని పేర్కొన్నారు.  


ప్రధానంగా సీమన్, హరి నాడార్ ఫాలోవర్ల వేధింపుల వల్లే తాను ఆత్మహత్యాయత్నానికి పాల్పడినట్టు చెప్పారు. ఆన్‌లైన్ మాధ్యమంగా తనను వేధిస్తున్నందుకు గాను వారిద్దరినీ అరెస్ట్ చేయాలని డిమాండ్ చేశారు. ఫేస్‌బుక్‌లో ఆమె పోస్టు చేసిన వీడియోలో ‘‘ఇది నా చివరి వీడియో. సీమన్, అతడి పార్టీ కార్యకర్తల వల్ల గత నాలుగు నెలలుగా నేను తీవ్ర ఒత్తిడిలో ఉన్నాను. నా కుటుంబాన్ని కాపాడుకోవడానికి చాలా ప్రయత్నించా. మీడియాలో నన్ను హరి నాడార్ అవమానించారు. నేను బీపీ మాత్రలు తీసుకున్నా. మరి కాసేపట్లో నా బీపీ పడిపోతుంది. ఆ తర్వాత చనిపోతా’’ అని పేర్కొన్నారు.  


తన చావు కనువిప్పు కావాలని, సీమన్, హరినాడార్‌లను విడిచిపెట్టవద్దని తన అభిమానులను కోరారు. కాగా, ఆ తర్వాత విజయలక్ష్మిని చెన్నైలోని ఓ ప్రైవేటు ఆసుపత్రిలో చేర్చినట్టు తెలుస్తోంది. ప్రస్తుతం ఆమె అక్కడ చికిత్స పొందుతున్నారు. కాగా, తమిళనాడు, పుదుచ్చేరిలో రాజకీయ ఉనికి కలిగిన తమిళ జాతీయ పార్టీ అయిన ‘నామ్ తమిలార్ కచ్చి’ నాయకుడు సీమాన్. మరోవైపు రాజకీయ సంస్థ ‘పనన్‌కట్టు పాడై’కి చెందిన హరి నాడార్ గత ఏడాది అక్టోబర్‌లో తమిళనాడులో జరిగిన నంగునేరి అసెంబ్లీ ఉప ఎన్నికలో పోటీ చేసి పరాజయం పాలయ్యారు. 

Updated Date - 2020-07-27T03:43:50+05:30 IST