తమిళ నటి చిత్ర భర్త అరెస్టు

ABN , First Publish Date - 2020-12-15T18:16:07+05:30 IST

తమిళ పాపులర్ టీవీ నటి, వీడియో జాకీ చిత్ర భర్త హేమంత్‌ను తమిళనాడు పోలీసులు..

తమిళ నటి చిత్ర భర్త అరెస్టు

చెన్నై: తమిళ పాపులర్ టీవీ నటి, వీడియో జాకీ చిత్ర భర్త హేమంత్‌ను తమిళనాడు పోలీసులు మంగళవారంనాడు అరెస్టు చేశారు. చిత్ర ఈనెల 9న నజ్రత్‌పేటలోని ఓ హోటల్ రూమ్‌లో ఆత్మహత్య చేసుకుంది. భర్తే స్వయంగా ఆమెను ఆత్మహత్యకు  ప్రేరేపించాడంటూ తమిళనాడు పోలీసులు హేమంత్‌ను అరెస్టు చేశారు.


కొద్ది నెలలో క్రితమే చిత్ర-హేమంత్ పెళ్లి చేసుకున్నారు. ఒక టీవీ సీరియల్‌లో ఆమె చనువుగా నటించిన కొన్ని సన్నివేశాలు చూసి హేమంత్‌‌‌ కోప్పడ్డాడని, ఆమెను చేతితో నెట్టివేసిన ఘటన కూడా ఆత్మహత్య చేసుకున్న రోజు చోటుచేసుకుందని పోలీసులు చెబుతున్నారు. చిత్రను హేమంత్ శారీరకంగా వేధించేవాడని ఆమె తల్లి పేర్కొంది.


ఇరవై తొమ్మిదేళ్ల చిత్ర పలు తమిళ అడ్వర్‌జైట్‌మెంట్లలోనూ, వివిధ టీవీ షోలకు యాంకర్‌గానూ పని చేసింది. 'పాండియన్ సోర్స్' అనే తమిళ టీవీ షోలో ఆమె పాత్రకు మంచి పేరు వచ్చింది. మక్కల్ టీవీ, జయ టీవీ, జీ తమిళ్ వంటి ఛానెల్స్‌లో ఆమె పలు టీవీషోలు చేసింది.

Updated Date - 2020-12-15T18:16:07+05:30 IST

Read more