అందుకే స్పెషల్ సాంగ్స్ చేస్తున్నా: తమన్నా

ABN , First Publish Date - 2020-06-10T15:32:38+05:30 IST

వరుస అవకాశాలు అందిపుచ్చుకుంటున్న మిల్కీ బ్యూటీ తమన్నా ప్రస్తుతం లాక్‌డౌన్ కారణంగా ఇంటికే పరిమితమైంది.

అందుకే స్పెషల్ సాంగ్స్ చేస్తున్నా: తమన్నా

వరుస అవకాశాలు అందిపుచ్చుకుంటున్న మిల్కీ బ్యూటీ తమన్నా ప్రస్తుతం లాక్‌డౌన్ కారణంగా ఇంటికే పరిమితమైంది. ఇంటి వంట ఆరగిస్తూ తనకు నచ్చిన సినిమాలను చూస్తూ కాలం గడుపుతోంది. తాజాగా సోషల్ మీడియా ద్వారా లైవ్‌లోకి వచ్చిన తమన్నా స్పెషల్ సాంగ్స్ గురించి మాట్లాడింది. 


`నేను ప్రత్యేక గీతాలు చేయడాన్ని చాలా మంది తప్పుగా అర్థం చేసుకుంటున్నారు. డబ్బు కోసమే అలాంటి పాటలు చేస్తున్నానని అంటున్నారు. అలాంటి వారి మాటలు నేను పట్టించుకోను. నాకు డ్యాన్స్ అంటే చాలా ఇష్టం. నా డ్యాన్సింగ్ స్కిల్స్ చూపించే అవకాశం వాటి వల్ల కలుగుతోంది. పైగా వీటి వల్ల గతంలో నేను పనిచేసిన స్టార్స్‌తో మళ్లీ కలిసి పనిచేసే అవకాశం వస్తోంది. అందుకే నేను స్పెషల్ సాంగ్స్ చేస్తున్నాన`ని తమన్నా చెప్పింది. 

Updated Date - 2020-06-10T15:32:38+05:30 IST