రాజమౌళి నుంచి కాల్ వచ్చిందంటే..: తమన్నా

ABN , First Publish Date - 2020-07-03T22:11:51+05:30 IST

కెరీర్ ఆరంభించిన నాటి నుంచి ఎప్పుడూ ఇంతలా విశ్రాంతి తీసుకోలేదని, లాక్‌డౌన్ కారణంగా లభించిన విరామ సమయాన్ని బాగా ఆస్వాదించానని మిల్కీబ్యూటీ తమన్నా చెప్పింది.

రాజమౌళి నుంచి కాల్ వచ్చిందంటే..: తమన్నా

కెరీర్ ఆరంభించిన నాటి నుంచి ఎప్పుడూ ఇంతలా విశ్రాంతి తీసుకోలేదని, లాక్‌డౌన్ కారణంగా లభించిన విరామ సమయాన్ని బాగా ఆస్వాదించానని మిల్కీబ్యూటీ తమన్నా చెప్పింది. లాక్‌డౌన్ వల్ల ఎన్నో విషయాలు నేర్చుకున్నానని, ముఖ్యంగా కుటుంబ సభ్యులతో ఎక్కువ సమయం గడిపే అవకాశం వచ్చిందని తెలిపింది. 


తాజాగా ఓ ఇంటర్వ్యూ ఇచ్చిన తమన్నా.. రాజమౌళి సినిమాలో అవకాశం గురించి మాట్లాడింది. `తనకు తెలిసిన వారే కదా అని రాజమౌళి తన సినిమాలో అవకాశం ఇవ్వరు. సినిమాలోని ఆ పాత్రకు సరిపోయిన వారినే ఆయన ఎంచుకుంటారు. రాజమౌళి నుంచి మీకు కాల్ వచ్చిందంటే.. ఆ పాత్ర మీ కోసమే తయారైందని అర్థం` అంటూ తమన్నా వివరించింది. 

Updated Date - 2020-07-03T22:11:51+05:30 IST