మాతృభాష నేర్చుకుంటున్న తమన్నా
ABN , First Publish Date - 2020-05-09T15:33:18+05:30 IST
మిల్కీబ్యూటీ తమన్నా కూడా కొత్త విషయాలను నేర్చుకుంటున్నారట. తమన్నాకు తన మాతృభాష సింధి మాట్లాడటం రాదట.

కరోనా ప్రభావంతో లాక్‌డౌన్ పరిస్థితి కొనసాగుతోంది. షూటింగ్స్ అన్నీ రద్దు కావడంతో సినీ సెలబ్రిటీలు ఇంటికే పరిమితమయ్యారు. కొత్త విషయాలను నేర్చుకోవడానికి ఆసక్తి చూపుతున్నారు. ఇప్పుడు మిల్కీబ్యూటీ తమన్నా కూడా కొత్త విషయాలను నేర్చుకుంటున్నారట. తమన్నాకు తన మాతృభాష సింధి మాట్లాడటం రాదట. అందుకని ఈ లాక్‌డౌన్ సమయంలో దానిపై పట్టు సాధించడానికి ప్రయత్నిస్తున్నారట. తల్లితో సింధిలోనే మాట్లాడే ప్రయత్నం చేస్తున్నానని తమన్నా రీసెంట్ ఇంటర్వ్యూలో తెలిపారు. లాక్‌డౌన్ సమయంలో తనతో సింధిలోనే మాట్లాడాలనే కండీషన్ పెట్టడమే కాకుండా ఏడాదిలో సింధి నేర్చుకోవాలని లక్ష్యం పెట్టుకున్నారట తమన్నా.