తమన్నా తప్పుకోలేదు
ABN , First Publish Date - 2020-11-04T07:12:30+05:30 IST
కన్నడంలో విజయం సాధించిన ‘లవ్ మాక్‌టైల్’ చిత్రం తెలుగులో ‘గుర్తుందా శీతాకాలం’ టైటిల్‌తో రీమేక్ అవుతున్న సంగతి...

కన్నడంలో విజయం సాధించిన ‘లవ్ మాక్‌టైల్’ చిత్రం తెలుగులో ‘గుర్తుందా శీతాకాలం’ టైటిల్‌తో రీమేక్ అవుతున్న సంగతి తెలిసిందే! నాగ శేఖర్ దర్శకత్వం వహిస్తున్న ఈ చిత్రంలో తమన్నా, సత్యదేవ్ జంటగా నటిస్తున్నారు. గత నెల ఈ సినిమా షూటింగ్ ప్రారంభం కావాల్సి ఉంది. అయితే తమన్నా కరోనా బారిన పడడంతో షూటింగ్ వాయిదా పడింది. దాంతో డేట్స్ అడ్జస్ట్ కాక తమన్నా ఈ చిత్రం నుంచి తప్పుకొన్నారన్న వదంతులు గత రెండు రోజులుగా వినిపిస్తున్నాయి. అయితే ఇందులో నిజం లేదని తమన్నా సన్నిహితుల సమాచారం. ప్రస్తుతం తమన్నా హైదరాబాద్‌లో ఓ వెబ్ సిరీస్ షూటింగ్‌తో బిజీగా ఉన్నారు. ఈ నెల 9 నుంచి ‘గుర్తుందా శీతాకాలం’ చిత్రీకరణ మొదలవుతుంది. జనవరిలో తమన్నా ఈ సినిమా చిత్రీకరణలో పాల్గొంటారని తెలిసింది. ఈ చిత్రాన్ని నాగ శేఖర్‌తో కలిసి భావన రవి నిర్మిస్తున్నారు.