‘జె మీడియా 361 డిగ్రీస్’ లోగో విడుదల

ABN , First Publish Date - 2020-06-15T04:53:23+05:30 IST

అత్యాధునిక హాంగులతో పాటు.. డిస్ ఇన్ఫెక్టెడ్ స్టూడియో నిర్మాణం మొదలుపెట్టింది జె మీడియా. సినిమా ప్రమోషనల్ ఈవెంట్స్‌ని కొత్త పుంతలు తొక్కించి ఎల్‌ఈడి స్ర్కీన్స్‌ని ప్రజెంట్

‘జె మీడియా 361 డిగ్రీస్’ లోగో విడుదల

అత్యాధునిక హాంగులతో పాటు.. డిస్ ఇన్ఫెక్టెడ్ స్టూడియో నిర్మాణం మొదలుపెట్టింది జె మీడియా. సినిమా ప్రమోషనల్ ఈవెంట్స్‌ని కొత్త పుంతలు తొక్కించి ఎల్‌ఈడి స్ర్కీన్స్‌ని ప్రజెంట్ చేయడంలో నెంబర్ వన్ అనిపించుకున్న జె మీడియా అధినేత నరేంద్ర మరో అత్యాధునిక స్టూడియో నిర్మాణానికి ముందడుగు వేసారు. జె మీడియా 361 డిగ్రీస్ పేరుతో నిర్మించబోయే ఈ స్టూడియో ప్రపంచలోనే మొదటి డిస్ ఇన్ఫెక్టెడ్ స్టూడియోగా చరిత్ర‌లో నిలవబోతుంది. హైదరాబాద్ సమీపంలోని గోపన్నపల్లిలో ఈవెంట్స్‌కి, సినిమా షూటింగ్స్‌కు అనువుగా ఉండే స్టూడియో నిర్మాణం త్వరలోనే ప్రారంభం కాబోతుంది.  


కంప్లీట్ సెటెప్‌తో ప్రతీ ఎక్విప్మెంట్‌ని స్టూడియోలోనే అందుబాటులో ఉంచుతూ.. సౌండ్, లైటింగ్ వంటి డిపార్ట్ మెంట్‌లలో అత్యాధునిక టెక్నాలిజీతో స్టూడియో నిర్మాణం కాబోతుంది. వీటితో పాటు టాప్ క్లాస్ సూట్ రూమ్స్, లాంజ్ లు, పూల్ ఏరియా నిర్మాణం కూడా వీటిలో భాగం అవుతుంది. గోపన్నపల్లిలో లక్షా ముప్పై ఐదు వేల చదరపు అడుగలలో నిర్మాణం అయ్యే ఈ స్టూడియో  హైఎండ్ టెక్నాలిజీ‌తో సినిమా రంగంలో కొత్త ఒరవడి సృష్టించబోతుంది. ఈ స్టూడియో లోగోని సినిమాటోగ్రఫీ మంత్రి తలసాని శ్రీనివాస్ యాదవ్ తనయుడు, టీఆర్ఎస్ లీడర్ తలసాని సాయికిరణ్ లాంచ్ చేసారు. ఈ లోగో మరియు ఈ ప్రాజెక్ట్ ఐడియా చాలా బాగా నచ్చాయనీ, నరేందర్‌కు ఆయన శుభాకాంక్షలు తెలియజేశారు. త్వరలోనే ఈ స్టూడియో నిర్మాణం ప్రారంభం కాబోతుంది.

Updated Date - 2020-06-15T04:53:23+05:30 IST