‘తలైవి’ న్యూలుక్
ABN , First Publish Date - 2020-10-12T07:26:35+05:30 IST
చక్కగా చీరకట్టుకొని నుదుట రూపాయి కాసంత బొట్టుతో, చక్కగా అల్లిన జడతో సంప్రదాయబద్దంగా కనిపించారు బాలీవుడ్ నటి కంగనా రనౌత్. తమిళనాడు మాజీ ముఖ్యమంత్రి...

చక్కగా చీరకట్టుకొని నుదుట రూపాయి కాసంత బొట్టుతో, చక్కగా అల్లిన జడతో సంప్రదాయబద్దంగా కనిపించారు బాలీవుడ్ నటి కంగనా రనౌత్. తమిళనాడు మాజీ ముఖ్యమంత్రి దివంగత జయలలిత జీవిత కథ ఆధారంగా రూపొందుతున్న ‘తలైవి’ చిత్రం కోసం ఆమె న్యూలుక్‌లో కనిపించారు. సోషల్ మీడియా వేదికగా కొత్త స్టిల్స్‌ను అభిమానులతో పంచుకున్నారామె. లాక్‌డౌన్ తర్వాత హైదరాబాద్‌లో మొదలైన తాజా షెడ్యూల్ పూర్తి చేసుకొని తన స్వస్థలం మనాలికి తిరిగెళ్లారు కంగనా. ‘కరోనా తర్వాత చాలా విషయాలు మారాయి. కానీ యాక్షన్, కట్ తప్ప. జయ అమ్మ ఆశీర్వాదంతో ‘తలైవి’ చిత్రం మరో షెడ్యూల్ పూర్తిచేసుకుంది’’ అని కంగనా ఇన్‌స్టాగ్రామ్‌లో పేర్కొన్నారు. తెలుగు, తమిళ, హిందీ భాషల్లో రూపొందుతున్న ఈ చిత్రానికి ఎ.ఎల్ విజయ్ దర్శకుడు.
Read more