వృద్ధులను జాగ్రత్తగా చూసుకోండి: శంకర్ మహదేవన్
ABN , First Publish Date - 2020-04-16T22:26:05+05:30 IST
కరోనా మహమ్మారిని ఎదుర్కొనేందుకు ప్రభుత్వాలు ఎంతగానో ప్రయత్నాలు చేస్తున్నాయి. ప్రజలందరినీ ఈ మహమ్మారి నుంచి క్షేమంగా ఉంచేందుకు ప్రధాని మోదీ లాక్‌డౌన్‌ను

కరోనా మహమ్మారిని ఎదుర్కొనేందుకు ప్రభుత్వాలు ఎంతగానో ప్రయత్నాలు చేస్తున్నాయి. ప్రజలందరినీ ఈ మహమ్మారి నుంచి క్షేమంగా ఉంచేందుకు ప్రధాని మోదీ లాక్‌డౌన్‌ను మే 3 వరకు పొడిగించారు. ఈ కష్టకాలంలో ప్రభుత్వాలు తీసుకుంటున్న నిర్ణయాలకు మద్దతు తెలుపుతూ దక్షిణాది ప్రజలతో పాటు ప్రజలందరూ ఇళ్లలోనే ఉండాలని ప్రముఖ గాయకుడు శంకర్ మహదేవన్ ఏబీఎన్ ఆంధ్రజ్యోతి ద్వారా పిలుపునిచ్చారు.
‘‘నేను మీ శంకర్ మహదేవన్‌ని. ఈ మెసేజ్ దక్షిణాది ప్రజలందరి కోసం.. దక్షిణాది అనే కాదు.. ప్రజలందరి కోసం కూడానూ. దయచేసి అందరూ ఇంటిపట్టునే ఉండండి. సురక్షితంగా ఉండంటి. అలాగే భౌతిక దూరం పాటించండి. ఎవరికి వారు వ్యాధినిరోధక శక్తిని పెంచుకునే ప్రయత్నం చేయండి. తరచుగా చేతులు శుభ్రపరచుకుంటూ ఉండండి. ఎవరికి వారు జాగ్రత్తలు తీసుకుండి. ఒకవేళ ఇంటిలో ఎవరైనా వృద్ధులు ఉంటే వారిని ఇంకా జాగ్రత్తగా చూసుకోండి. అందరికీ మంచి జరగాలని కోరుకుంటున్నాను. దయచేసి ఇంటివద్దనే ఉండి సురక్షితంగా ఉండండి..’’ అని శంకర్ మహదేవన్ తెలిపారు.