తెలుగుతో మొదలెట్టి.. బాలీవుడ్‌లో నెంబర్ వన్‌గా నిలిచిన తాప్సీ

ABN , First Publish Date - 2020-04-02T23:52:18+05:30 IST

‘ఇంటర్నెట్ మూవీ డేటా బేస్’ నిర్వహించిన ఆన్ లైన్ సర్వేలో బాలీవుడ్ హీరోయిన్ తాప్సీ పన్ను అగ్రస్థానంలో నిలిచింది.

తెలుగుతో మొదలెట్టి.. బాలీవుడ్‌లో నెంబర్ వన్‌గా నిలిచిన తాప్సీ

‘ఇంటర్నెట్ మూవీ డేటా బేస్’ నిర్వహించిన ఆన్ లైన్ సర్వేలో బాలీవుడ్ హీరోయిన్ తాప్సీ పన్ను అగ్రస్థానంలో నిలిచింది. తన సినిమాల యావరేజ్ రేటింగ్ 6.72 ఉండటంతో టాప్ స్థానం దక్కించుకుంది. దీనిపై ఆమె మాట్లాడుతూ... తన సినిమాల జాబితాలో వంద కోట్ల సినిమాలు లేవని.. అయినా నటన ఆధారంగా అభిమానులు ఓటు వేయడం సంతృప్తినిచ్చిందన్నారు. నిదానమే ప్రదానమన్నది తన విజయ రహస్యమన్నారు. అభిమానుల విశ్వాసాన్ని చూరగొనడంలో అదే తనకు ఉపయోగపడిందన్నారు. తాను సరైన దారిలో వెళ్లడానికి ఉపయోగకరంగా ఉందని తెలిపింది. తెలుగు సినిమా ‘ఝుమ్మంది నాదం’తో తెరంగేట్రం చేసిన తాప్సీ.. పింక్, బద్లా, థప్పడ్ లాంటి సినిమాలతో బాలీవుడ్‌లో దూసుకుపోతోంది.  


సినిమాల యావరేజ్ రేటింగ్ ఆధారంగా ‘ఇంటర్నెట్ మూవీ డేటా బేస్’ ఈ సర్వే చేసింది. అలాగే మార్చి 1 నాటికి సుమారు 12 సినిమాలు చేసుండాలి. గత మూడేళ్ల నుంచి సినిమాలు లేని వారిని ఓటింగ్‌కి పరిగణనలోకి తీసుకోలేదు. కొంకణాసేన్ శర్మ, కల్కి కొచ్చిన్ పేర్లు ఓటింగ్‌లో లేరు. 

Updated Date - 2020-04-02T23:52:18+05:30 IST