రియా ఎవరో తెలీదు: తాప్సీ

ABN , First Publish Date - 2020-09-16T23:07:05+05:30 IST

బాలీవుడ్ యువ నటుడు సుశాంత్ సింగ్ రాజ్‌పుత్ మరణం కేసులో హీరోయిన్ రియా చక్రవర్తి తీవ్ర విమర్శలు ఎదుర్కొంది.

రియా ఎవరో తెలీదు: తాప్సీ

బాలీవుడ్ యువ నటుడు సుశాంత్ సింగ్ రాజ్‌పుత్ మరణం కేసులో హీరోయిన్ రియా చక్రవర్తి తీవ్ర విమర్శలు ఎదుర్కొంది. ఆ కేసులో డ్రగ్స్ కోణం వెలుగు చూడడంతో అరెస్ట్ కూడా అయింది. సామాన్యుల నుంచి రియా విమర్శలు ఎదుర్కొంటున్నప్పటికీ బాలీవుడ్ మాత్రం ఆమెకు మద్దతుగా నిలిచింది. ఇప్పటికే ఎంతో మంది బాలీవుడ్ ప్రముఖులు రియాకు అండగా నిలిచారు. 


తాజాగా హీరోయిన్ తాప్సీ కూడా రియాకు మద్దతుగా నిలిచింది. `రియా చక్రవర్తిని ఇప్పటివరకు నేను కలవలేదు. ఆమె ఎవరో నాకు తెలీదు. కానీ, ఆమె పట్ల జరుగుతున్నది చూస్తుంటే చాలా బాధగా ఉంది. ఏకపక్షంగా ఆమెను టార్గెట్ చేస్తున్న తీరు సరికాదు. బాలీవుడ్‌కు సంబంధించిన చాలా మంది గతంలో ఏదో ఒక సమయంలో తప్పులు చేసే ఉంటారు. అయితే వారెవరూ రియా ఎదుర్కొంటున్న పరిస్థితిని ఫేస్ చేసి ఉండర`ని తాప్సీ చెప్పింది. 

Updated Date - 2020-09-16T23:07:05+05:30 IST