కేర్‌టేక‌ర్‌కు క‌రోనా పాజిటివ్‌: టీ సిరిస్ బిల్డింగ్ సీల్‌!

ABN , First Publish Date - 2020-05-11T13:09:34+05:30 IST

మ‌హాన‌గ‌రం ముంబైలోని అంధేరి వెస్ట్ లింక్ రోడ్‌లో ఉన్న టీ సిరీస్ మ్యూజిక్ కంపెనీ కార్యాలయ భ‌వ‌నాన్ని సీల్ చేశారు. టీ సిరీస్ భవనంలో పనిచేస్తున్న ఒక కేర్‌టేకర్ కరోనా పాజిటివ్‌గా తేల‌డంతో భ‌వ‌నాన్ని మూసివేశారు.

కేర్‌టేక‌ర్‌కు క‌రోనా పాజిటివ్‌: టీ సిరిస్ బిల్డింగ్ సీల్‌!

ముంబై: మ‌హాన‌గ‌రం ముంబైలోని అంధేరి వెస్ట్ లింక్ రోడ్‌లో ఉన్న  టీ సిరీస్ మ్యూజిక్ కంపెనీ కార్యాలయ భ‌వ‌నాన్ని సీల్ చేశారు. టీ సిరీస్ భవనంలో పనిచేస్తున్న ఒక కేర్‌టేకర్ కరోనా పాజిటివ్‌గా తేల‌డంతో భ‌వ‌నాన్ని మూసివేశారు. ఈ సంద‌ర్భంగా టీ సిరీస్ ప్రతినిధి మాట్లాడుతూ, అంధేరిలోని కార్యాలయ సముదాయంలో ప‌నిచేస్తున్న‌ ఒక ఉద్యోగికి కరోనా సోకిన‌ట్లు వెల్ల‌డయ్యింది. దీంతో కరోనా వైరస్ వ్యాప్తి చెందకుండా ఉండేందుకు భవనం అంత‌టినీ మూసివేశార‌ని తెలిపారు. కాగా గత నెలలో టీ సిరీస్ కార్యాలయం ఎదుట‌నున్న‌ ఒక భవనాన్ని మూసివేశారు. అక్క‌డ ఉంటున్న‌ 11 ఏళ్ల బాలికకు కరోనా సోకింది. కాగా టీ సిరీస్ ప‌క్క‌నే ఉన్న భవనంలో బాలీవుడ్ ప్ర‌ముఖులు విక్కీ కౌషల్, రాజ్‌కుమార్ రావు, చిత్రాంగ‌దా సింగ్, చాహత్ ఖన్నా, అహ్మద్ ఖాన్, సప్నా ముఖర్జీ,  రాహుల్ దేవ్, ముగ్దా గాడ్సే, కృష్ణ అభిషేక్, కాశ్మీరీరా షా, నీల్ నితిన్ ఎల్. రాయ్, అర్జన్ బజ్వా, విపుల్ షా, ప్రభుదేవాల‌కు చెందిన ఫ్లాట్లు ఉన్నాయి. 

Updated Date - 2020-05-11T13:09:34+05:30 IST