స్వాతి దీక్షిత్ ఔట్.. మరో ట్విస్ట్ ఇచ్చిన బిగ్‌బాస్
ABN , First Publish Date - 2020-10-05T16:58:27+05:30 IST
ఈ వారం బిగ్‌బాస్ హౌస్ నుండి స్వాతి దీక్షితి ఎలిమినేట్ అయ్యింది. అయితే ప్రేక్షకులు మాత్రం బిగ్‌బాస్ ఇంత త్వరగా స్వాతిని ఎలిమినేట్ చేశాడంటే..

తెలుగు రియాలిటీ షో బిగ్‌బాస్ 4 నాలుగో వారం ఎలిమినేషన్ పూర్తయ్యింది. సాధారణంగా ఇప్పటి వరకు ఎలిమినేషన్స్‌లో నామినేట్ అయిన వారిని ఒక్కొక్కరినీ సేవ్ చేస్తూ వచ్చి ఆదివారం ఎలిమినేషన్‌ను అనౌన్స్ చేస్తారు. కానీ ఈసారి మాత్రం అందుకు భిన్నంగా బిగ్‌బాస్ శనివారం ఎలిమినేషన్‌ను కాబోయేది ఎవరో చెప్పేయడం విశేషం. ఈ వారం బిగ్‌బాస్ హౌస్ నుండి స్వాతి దీక్షితి ఎలిమినేట్ అయ్యింది. అయితే ప్రేక్షకులు మాత్రం బిగ్‌బాస్ ఇంత త్వరగా స్వాతిని ఎలిమినేట్ చేశాడంటే..ఆమెను సీక్రెట్‌లోకి పంపుతారని అందరూ భావించారు. అయితే అలాంటిదేమీ జరగలేదు. చివరలో స్వాతి వెళుతూ వెళుతూ కెప్టెన్‌గా నామినేట్ కాకుండా ఉండే బిగ్‌బాంబ్‌ను అమ్మారాజశేఖర్‌పై విసురుతున్నట్లు ప్రకటించింది.
దీని తర్వాత మరో ఎలిమినేషన్ ఉంటుందని నాగార్జున చెబుతూ వచ్చారు. బిగ్‌బాస్ హౌస్‌లో అందరూ సమానమే చెబుతూ.. లేడీస్‌ను జెంట్స్, జెంట్స్‌ను లేడీస్‌గా వేషాలు వేయించి పాటలకు స్టెప్స్ వేయించడం, సీన్స్‌లో యాక్ట్ చేయించడం చేశారు. అలాగే రెండు టీమ్స్‌గా విభజించి కబడ్డీ ఆడించారు. చివరగా, ఏడుగురిలో స్వాతి దీక్షిత్ బయటకు వెళ్లిపోయిన తర్వాత చివరలో అభిజీత్, మెహబూబ్, లాస్య తొలి మూడుస్థానాల్లో నిలబెట్టిన బిగ్‌బాస్ నాలుగు, ఐదు, ఆరో స్థానాలను వారినే నిర్ణయించుకోమని సూచించాడు. సోహైల్, కుమార్ సాయి, హారిక ఎవరు ఆ స్థానాల్లో నిలబడాలనే దానిపై చర్చ జరిగింది. చివరకు నాలుగో స్థానంలో సోహైల్, ఐదో స్థానంలో కుమార్ సాయి, ఆరో స్థానంలో హారిక ఓకే అని ఇతర కంటెస్టెంట్స్ సూచించారు. ఇందులో చివరగా నిలిచిన హారిక ఎలిమినేట్ అవుతుందేమోనని చాలా మంది భావించారు కానీ.. ఎవరూ ఎలిమినేట్ కావడం లేదని బిగ్‌బాస్ ప్రకటించి కంటెస్టెంట్స్‌లో సంతోషం నింపారు. ఎంట్రీ ఇచ్చిన ఓ వారం తర్వాత స్వాతినిని ఎలిమినేట్ చేసి అందరికీ షాకిచ్చాడు బిగ్‌బాస్.. ఈవారం అదే ట్విస్ట్‌గా నిలిచింది.
Read more