కంగనలా నాకు సెక్యూరిటీ అక్కర్లేదు: స్వర భాస్కర్

ABN , First Publish Date - 2020-09-08T18:49:31+05:30 IST

కంగనా రనౌత్‌లా తనకు సెక్యూరిటీ అక్కర్లేదని, ప్రభుత్వ సంపదను అభివృద్ధి కార్యక్రమాలకు వినియోగిస్తే మంచిదని

కంగనలా నాకు సెక్యూరిటీ అక్కర్లేదు: స్వర భాస్కర్

కంగనా రనౌత్‌లా తనకు సెక్యూరిటీ అక్కర్లేదని, ప్రభుత్వ సంపదను అభివృద్ధి కార్యక్రమాలకు వినియోగిస్తే మంచిదని హీరోయిన్ స్వరభాస్కర్ సూచించింది. త్వరలో ముంబై రాబోతున్న కంగనకు కేంద్ర ప్రభుత్వం వై కేటగిరీ భద్రత కల్పించిన సంగతి తెలిసిందే. 


కంగనకు కేంద్ర ప్రభుత్వం వై కేటగిరీ భద్రత కల్పించడంపై ఓ నెటిజన్ స్పందిస్తూ.. `ఏ నటికైనా ప్రభుత్వం భద్రత కల్పించాలనుకుంటే.. ముందుగా స్వర భాస్కర్‌నే పరిగణనలోకి తీసుకోవాలి. సోషల్ మీడియా వేదికగా ఎన్నో అసభ్యకరమైన, భయంకరమైన బెదిరింపులను స్వర ఎదుర్కొంటోంద`ని కామెంట్ చేశారు. ఈ ట్వీట్‌కు స్వర స్పందిస్తూ.. `ధన్యావాదాలు. కానీ, నాకు వద్దు. ట్యాక్స్ కడుతున్న వారి డబ్బు మంచి కార్యక్రమాలకు ఉపయోగపడాలి. ఆ సంపదను అభివృద్ధి కార్యక్రమాలకు, పోషకాహారం కోసం ఉపయోగించాల`ని ట్వీట్ చేసింది. 
Updated Date - 2020-09-08T18:49:31+05:30 IST