దీపిక రూ.5 కోట్లు తీసుకోవడం నిజం కాదు: స్వర భాస్కర్

ABN , First Publish Date - 2020-07-31T16:50:03+05:30 IST

పౌర‌స‌త్వ స‌వ‌ర‌ణ చ‌ట్టం(సీఏఏ), ఎన్ఆర్‌సీకి వ్య‌తిరేకంగా పోరాడుతున్న విద్యార్థులకు సంఘీభావం తెలిపేందుకు

దీపిక రూ.5 కోట్లు తీసుకోవడం నిజం కాదు: స్వర భాస్కర్

పౌర‌స‌త్వ స‌వ‌ర‌ణ చ‌ట్టం(సీఏఏ), ఎన్ఆర్‌సీకి వ్య‌తిరేకంగా పోరాడుతున్న విద్యార్థులకు సంఘీభావం తెలిపేందుకు బాలీవుడ్ అగ్ర కథానాయిక దీపికా పదుకొణే ‌జవ‌హ‌ర్‌లాల్ నెహ్రూ యూనివ‌ర్సిటీ(జేఎన్‌యూ)ని సందర్శించడం అప్పట్లో తీవ్ర దుమారాన్ని లేపింది. కేంద్ర ప్ర‌భుత్వం తీసుకువ‌చ్చిన‌ సదరు ఆర్డినెన్సులకు వ్యతిరేకంగా జేఎన్‌యూలో చేపట్టిన ఆందోళనలు హింసాత్మకంగా మారాయి. దాంతో బాధిత విద్యార్థుల‌కు సంఘీభావం తెలిపేందుకు జ‌న‌వ‌రి 7న దీపిక ‌జేఎన్‌యూకు వెళ్లింది. అయితే అలా వెళ్లడం కోసం దీపిక రూ.5 కోట్లు తీసుకుందంటూ ప్రస్తుతం ట్విటర్‌లో తీవ్రంగా ప్రచారం జరుగుతోంది. 


ఈ ప్రచారాన్ని మరో హీరోయిన్ స్వర భాస్కర్ తీవ్రంగా ఖండించింది. అది పూర్తిగా అవాస్తవమని పేర్కొంది. దీంతో ఓ నెటిజన్ స్వరభాస్కర్‌పై వ్యంగ్యంగా ఓ ట్వీట్ చేశాడు. `జేఎన్‌యూలో రెండు నిమిషాలు ఉన్నందుకే  దీపిక‌ ఐదు కోట్లు తీసుకుంది. కానీ, ఏడాదిగా సీఏఏకు వ్య‌తిరేకంగా అరిచి గీపెడుతున్నా స్వ‌ర భాస్క‌ర్‌ కేవ‌లం ఓ సీ-గ్రేడ్ వెబ్ సిరీస్‌ అవ‌కాశాన్ని మాత్ర‌మే సంపాదించింది. దేవుడా... మ‌నుషుల‌కు నిరాశ‌ను ఇచ్చినా ప‌ర్వాలేదు కానీ ఈ క‌మ్యూనిజాన్ని మాత్రం ఇవ్వ‌కు` అని ట్వీట్ చేశాడు. దీనికి స్వరభాస్కర్ స్పందిస్తూ.. బాలీవుడ్ గురించి అలాంటి చెత్త వార్తలను ఎలా ప్రచారం చేస్తున్నారని, అలాంటి వార్తలను నమ్మడం మూర్ఖత్వమని పేర్కొంది. 




Updated Date - 2020-07-31T16:50:03+05:30 IST