‘మళ్లీ రావా’, ‘ఏజెంట్.. ఆత్రేయ’.. తర్వాత చిత్రమిదే
ABN , First Publish Date - 2020-12-25T01:10:32+05:30 IST
'మళ్లీ రావా', 'ఏజెంట్ సాయిశ్రీనివాస ఆత్రేయ' వంటి విమర్శకుల ప్రశంసలు పొందిన రెండు కమర్షియల్ హిట్ ఫిలిమ్స్‌ను అందించిన స్వధర్మ్ ఎంటర్‌టైన్‌మెంట్ నుంచి మూడో చిత్రం

'మళ్లీ రావా', 'ఏజెంట్ సాయిశ్రీనివాస ఆత్రేయ' వంటి విమర్శకుల ప్రశంసలు పొందిన రెండు కమర్షియల్ హిట్ ఫిలిమ్స్‌ను అందించిన స్వధర్మ్ ఎంటర్‌టైన్‌మెంట్ నుంచి మూడో చిత్రం రాబోతోంది. చేసిన రెండు చిత్రాలతో ఈ బ్యానర్ నుంచి సినిమా వస్తోంది అంటే.. అది ఖచ్చితంగా కంటెంట్ ఉన్న చిత్రమే అయి ఉంటుంది అనేలా ప్రేక్షకుల మదిలో స్థానం సంపాదించుకుంది స్వధర్మ్ ఎంటర్‌టైన్‌మెంట్. ఇక ఇప్పుడు హ్యాట్రిక్ ఫిల్మ్‌గా తెరకెక్కబోతోన్న చిత్రానికి 'మసూద' అనే టైటిల్‌ని ఖరారు చేస్తూ.. టైటిల్ లుక్‌ను విడుదల చేశారు చేశారు. అంతకుముందు చేసిన రెండు సినిమాల తరహాలోనే ఇది కూడా కంటెంట్ రిచ్ ఫిల్మ్ అని నిర్మాత రాహుల్ యాదవ్ నక్కా తెలుపుతున్నారు.
ఇదిలా ఉంటే.. 'మళ్లీ రావా' చిత్రంతో గౌతమ్ తిన్ననూరి, 'ఏజెంట్ సాయిశ్రీనివాస ఆత్రేయ' చిత్రంతో స్వరూప్ ఆర్.ఎస్.జె. లాంటి ఇద్దరు ప్రతిభావంతులైన డైరెక్టర్లను పరిచయం చేసిన స్వధర్మ్ ఎంటర్‌టైన్‌మెంట్, ఇప్పుడు 'మసూద' మూవీతో మరో ప్రామిసింగ్ డైరెక్టర్ సాయికిరణ్‌ను పరిచయం చేస్తోంది. హారర్ డ్రామాగా రూపొందుతున్న ఈ చిత్రంలో హీరోగా 'జార్జిరెడ్డి' ఫేమ్ తిరువీర్ (లల్లన్ సింగ్ పాత్రధారి) నటిస్తుండగా, 'గంగోత్రి'లో బాలనటిగా అలరించిన కావ్య కల్యాణ్‌రామ్ హీరోయిన్‌గా పరిచయమవుతున్నారు. సంగీత ముఖ్యమైన పాత్రను చేస్తున్నారు. పదిహేడు సంవత్సరాల తన కూతురు అనూహ్యంగా ప్రవర్తిస్తుండటంతో ఆందోళన చెందిన ఒక ఒంటరి తల్లి, అతి భయస్తుడైన పక్కింటి యువకుడి సహాయంతో కూతుర్ని ఎలా కాపాడుకుందనేది ఈ చిత్రంలోని ప్రధానాంశం. ఈ చిత్రానికి ప్రశాంత్ ఆర్. విహారి సంగీత దర్శకునిగా, నగేష్ బానెల్ సినిమాటోగ్రాఫర్‌గా పని చేస్తున్నారు.
Read more