ఫ్యాన్ రాసిన ప్రేమలేఖతో సుస్మితాసేన్ ఫిదా

ABN , First Publish Date - 2020-06-28T22:47:26+05:30 IST

సుమారు 10 సంవత్సరాల తర్వాత సినిమాలలోకి రీ ఎంట్రీ ఇచ్చిన సుస్మితాసేన్‌కు ఆమె అభిమాని ఒకరు ప్రేమలేఖ రాశారు. ఆ ప్రేమలేఖను చూసి సుస్మితాసేన్ ఎంతో మురిసిపోతుంది. ‘ఆర్య’ అనే

ఫ్యాన్ రాసిన ప్రేమలేఖతో సుస్మితాసేన్ ఫిదా

సుమారు 10 సంవత్సరాల తర్వాత సినిమాలలోకి రీ ఎంట్రీ ఇచ్చిన సుస్మితాసేన్‌కు ఆమె అభిమాని ఒకరు ప్రేమలేఖ రాశారు. ఆ ప్రేమలేఖను చూసి సుస్మితాసేన్ ఎంతో మురిసిపోతుంది. ‘ఆర్య’ అనే వెబ్ సిరీస్‌తో రీ ఎంట్రీ ఇచ్చిన సుస్మితాసేన్.. ఇకపై మంచి పాత్రలు వస్తే ఖచ్చితంగా నటిస్తానంటూ తెలిపింది. తాజాగా ఆమె తనకు వచ్చిన ప్రేమలేఖను తన ఇన్‌స్టాగ్రమ్‌లో పోస్ట్ చేసి.. ఇటువంటి లెటర్స్ నాకు కొత్త ఉత్సాహాన్నీ నింపుతాయని, ఇటువంటివి మరికొన్ని నా అభిమానుల నుంచి ఊహిస్తున్నానని తెలిపింది.


‘‘అద్భుతమైన ప్రేమ లేఖ. ఎప్పటి నుంచో నా అభిమానుల నుంచి ప్రేమ, అభిమానం పొందుతున్నందుకు అదృష్టంగా భావిస్తున్నాను. స్వ హస్తాలతో రాసిన ప్రేమలేఖలు నాకు చాలా ఇష్టం. నాకు వచ్చే ప్రతి లేఖ‌ను నేను స్వ‌యంగా చదువుతాను. అయితే మొద‌టిసారి చాలా సింపుల్​గా రాసిన ల‌వ్ లెట‌ర్ ఓ అభిమాని పంపారు. ఇది సాధారణంగా భావోద్వేగాల ప్రవాహం, ఎంతో ప్రేమను పేజీలపై పొందుపరచి పంపించారు. దీనిని లైఫ్ లాంగ్ గుర్తుపెట్టుకుంటాను. ఐ లవ్ యూ టూ.." అని సుస్మితాసేన్ తన ఇన్‌స్టాగ్రమ్‌లో పోస్ట్ చేసింది. దీంతో పాటు అభిమాని రాసిన లెటర్‌ను కూడా ఆమె జతచేసింది.Updated Date - 2020-06-28T22:47:26+05:30 IST