ఫేక్ న్యూస్ అనుకున్నా: సంజ‌నా సంఘి

ABN , First Publish Date - 2020-06-16T19:11:53+05:30 IST

బాలీవుడ్ హీరో సుశాంత్ సింగ్ రాజ్‌పుత్ ఆత్మ‌హ‌త్య చేసుకున్నారు. బాలీవుడ్ ఈ విషాదం నుండి ఇంకా తేరుకోనేలేదు. ప‌లువురు బాలీవుడ్ ప్ర‌ముఖులు సుశాంత్ మ‌ర‌ణంపై ఆవేద‌న‌ను వ్య‌క్తం చేశారు.

ఫేక్ న్యూస్ అనుకున్నా:  సంజ‌నా సంఘి

బాలీవుడ్ హీరో సుశాంత్ సింగ్ రాజ్‌పుత్ ఆత్మ‌హ‌త్య చేసుకున్నారు. బాలీవుడ్ ఈ విషాదం నుండి ఇంకా తేరుకోనేలేదు. ప‌లువురు బాలీవుడ్ ప్ర‌ముఖులు సుశాంత్ మ‌ర‌ణంపై ఆవేద‌న‌ను వ్య‌క్తం చేశారు. సుశాంత్ హీరోగా న‌టించిన ‘డ్రైవ్’ సినిమా గ‌త నెల మేలో విడుద కావాల్సింది. అయితే క‌రోనా ప్ర‌భావంతో సినిమా విడుద‌ల వాయిదా ప‌డింది. సుశాంత్ మ‌ర‌ణంపై ఆ సినిమా హీరోయిన్ సంజనా సంఘి ఓ ఎమోష‌న‌ల్ వీడియోను త‌న ఇన్‌స్టాగ్రామ్‌లో పోస్ట్ చేశారు. ‘‘సుశాంత్ మరణవార్త చూడగానే షాకయ్యాను. ఎవ‌రైనా ఫేక్ న్యూస్‌ను స్ప్రెడ్ చేస్తున్నారేమోన‌ని వంద‌సార్లు చెక్ చేసుకున్నాను. సుశాత్‌తో క‌లిసి నటించ‌డం మంచి అనుభూతి. షూటింగ్ స‌మ‌యంలో జ‌రిగిన విష‌యాల‌ను రిలీజ్ స‌మ‌యంలో రివీల్ చేయాల‌ని మేం అనుక‌న్నాం. కానీ ఇలా జ‌రుగుతుంద‌ని అనుకోలేదు. ఇది ఫ‌స్ట్ సినిమాయే కాదు.. బెస్ట్ సినిమా కూడా. నాకు షూటింగ్ లొకేష‌న్‌లో సుశాంత్ ఎంత‌గానో స‌పోర్ట్ అందించారు. నువ్వు మాతో ఎప్ప‌టికీ ఉంటావు’’ అని త‌న ఎమోష‌న్స్‌ను సంజ‌నా సంఘి తెలిపారు. Updated Date - 2020-06-16T19:11:53+05:30 IST