సుశాంత్ ఆర్థిక లావాదేవీల‌పై అనుమానం.. రియాకి బిగుస్తున్న ఉచ్చు

ABN , First Publish Date - 2020-07-29T16:14:26+05:30 IST

సుశాంత్ సింగ్ రాజ్‌పుత్ ప్రేమికురాలిగా ఉన్న రియాపై డబ్బుకు సంబంధించిన విషయంలోనూ, అలాగే సుశాంత్ ఆత్మహత్యకు సంబంధించి ఆమెపై ఆరోపణలు వస్తుండటంతో..

సుశాంత్ ఆర్థిక లావాదేవీల‌పై అనుమానం.. రియాకి బిగుస్తున్న ఉచ్చు

బాలీవుడ్ యువ క‌థానాయ‌కుడు సుశాంత్ సింగ్ రాజ్‌పుత్ ఆత్మ‌హ‌త్య నెపోటిజంపై పెద్ద దుమారాన్ని రేపింది. దీనిపై ఇంకా చ‌ర్చ న‌డుస్తూనే ఉంది. మ‌రో వైపు తాజాగా సుశాంత్ సింగ్ రాజ్‌పుత్ ప్రేమికురాలిగా ఉన్న రియాపై డబ్బుకు సంబంధించిన విషయంలోనూ, అలాగే సుశాంత్ ఆత్మహత్యకు సంబంధించి ఆమెపై ఆరోపణలు వస్తుండటంతో.. సుశాంత్ తండ్రి కె.కె.సింగ్‌ ఈ విషయం పోలీసులకు చెప్పడంతో ఆమెపై ఎఫ్ఐఆర్ నమోదు చేశారు. కె.కె.సింగ్ స్పందిస్తూ..‘‘గడిచిన ఏడాది కాలంలో రూ.17కోట్లలో రూ.15 కోట్లు ఓ అజ్ఞాత‌వ్య‌క్తికి ట్రాన్స్‌ఫ‌ర్ అయ్యాయి. ఇందులో రియా చ‌క్ర‌వ‌ర్తి పాత్ర ఏంటి? ఆమె కుటుంబ స‌భ్యుల‌కు ఎంత ట్రాన్స్‌ఫ‌ర్ అయ్యాయి అనే విష‌యాన్ని పోలీసుల‌కు ద‌ర్యాప్తు చేయాల‌ని పోలీసుల‌ను కోరుతున్నాను’’ అన్నారు. 

Updated Date - 2020-07-29T16:14:26+05:30 IST