సుశాంత్‌... ఎందుకిలా చేశావ్‌?

ABN , First Publish Date - 2020-06-16T06:10:54+05:30 IST

సుశాంత్‌ ఆకస్మిక మృతి పట్ల అమితాబ్‌ విచారం వ్యక్తం చేస్తూ, భావోద్వేగంతో బ్లాగ్‌లో ఓ పోస్ట్‌ పెట్టారు. ‘‘సుశాంత్‌ సింగ్‌ రాజ్‌పుత్‌ ఎందుకు నీ జీవితాన్ని అర్థంతరంగా ముగించావు? నీ మనసుని ఏమీ అడగకుండా...

సుశాంత్‌... ఎందుకిలా చేశావ్‌?

సుశాంత్‌ ఆకస్మిక మృతి పట్ల అమితాబ్‌ విచారం వ్యక్తం చేస్తూ, భావోద్వేగంతో బ్లాగ్‌లో ఓ పోస్ట్‌ పెట్టారు. ‘‘సుశాంత్‌ సింగ్‌ రాజ్‌పుత్‌ ఎందుకు నీ జీవితాన్ని అర్థంతరంగా ముగించావు? నీ మనసుని ఏమీ అడగకుండా, నిన్ను నీవు ప్రశ్నించుకోకుండా అద్భుతమైన ప్రతిభను, మేధాశక్తిని ఎందుకు పక్కన పెట్టావు? అని బిగ్‌బీ ఆవేదన వ్యక్తం చేశారు. ‘ఓసారి సుశాంత్‌ నన్ను కలిసినప్పుడు అంతర్జాతీయ టోర్నమెంట్‌లో ధోని కొట్టిన విన్నింగ్‌ సిక్స్‌ను వెండితెరపై అదేవిధంగా ఎలా కొట్టగలిగావు’ అని అడిగాను. ‘ధోని సిక్స్‌ కొట్టిన ఆ వీడియో క్లిప్‌ను వందలసార్లు చూశాను’ అని చెప్పాడు నాతో. ఈ ఒక్క ఉదాహరణ చాలు చేసే పని పట్ల అతనికున్న నిబద్థత తెలియజేయడానికి! ‘ధోని’ సినిమా కోసం తను పడ్డ కష్టం తెరపై కనిపించింది. వస్త్రధారణ, ధోని జీవితంలో మర్చిపోలేని సన్నివేశాల్లో నటించే సమయంలో అతని నటన అద్భుతంగా ఉంది. మాట్లాడే ప్రతి మాట వెనుక నిగూఢ అర్థం దాగి ఉండేది. గ్రూప్‌ డ్యాన్సర్‌గా జీవితం ప్రారంభించిన అతను కథానాయకుడిగా ఎదిగిన తీరు చూస్తే ఒక నాటకం చూసినట్లే అనిపిస్తోంది’’ అని అమితాబ్‌ బ్లాగ్‌లో రాసుకొచ్చారు.

Updated Date - 2020-06-16T06:10:54+05:30 IST