షారూక్ అవ‌మానించడంతో సుశాంత్ గాయ‌ప‌డ్డాడు: సునీల్‌

ABN , First Publish Date - 2020-08-19T16:16:35+05:30 IST

తాజాగా సుశాంత్ స‌న్నిహితుడు, జిమ్ పార్ట్‌న‌ర్ సునీల్ శుక్లా షారూక్ ఖాన్ వ‌ల్ల సుశాంత్ బాధ‌ప‌డ్డ ఘ‌ట‌న‌ను వివ‌రించారు. 2013లో జ‌రిగిన ఫిలింఫేర్ అవార్డుల్లో స్టేజీపై సుశాంత్‌ను షారూక్ అవ‌మానించార‌ని తెలిపారు.

షారూక్ అవ‌మానించడంతో సుశాంత్ గాయ‌ప‌డ్డాడు:  సునీల్‌

బాలీవుడ్ యువ క‌థానాయ‌కుడు సుశాంత్ సింగ్ రాజ్‌పుత్ ఆత్మ‌హ‌త్య త‌ర్వాత నెపోటిజంపై విమ‌ర్శ‌లు వ‌స్తున్నాయి. సుశాంత్ స‌న్నిహితులు, కుటుంబ స‌భ్యులు, స్నేహితులు త‌ను ఎదుర్కొన్న ప‌రిస్థితులను తెలియ‌జేస్తూ వ‌స్తున్నారు. తాజాగా సుశాంత్ స‌న్నిహితుడు, జిమ్ పార్ట్‌న‌ర్ సునీల్ శుక్లా షారూక్ ఖాన్ వ‌ల్ల సుశాంత్ బాధ‌ప‌డ్డ ఘ‌ట‌న‌ను వివ‌రించారు. 2013లో జ‌రిగిన ఫిలింఫేర్ అవార్డుల్లో స్టేజీపై సుశాంత్‌ను షారూక్ అవ‌మానించార‌ని తెలిపారు. సునీల్ శుక్లా మాట్లాడుతూ ‘‘ఫిలింఫేర్ ఇన్విటేష‌న్ అందుకున్న సుశాంత్ చాలా సంతోషంగా ఫీల‌య్యారు. స్టేజీపై సుశాంత్ కెరీర్ ఎలా సాగుతుంది, ఈ క్ర‌మంలో త‌ను ఎదుర్కొన్న స‌వాళ్ల గురించి మాట్లాడుతాన‌ని చెప్పిన షారూక్ ఖాన్‌.. అందుకు భిన్నంగా షారూక్ స్టేజీపై సుశాంత్‌ను అవమానించారు. దీంతో సుశాంత్ చాలా గాయపడ్డాడు’’ అన్నారు. 

Updated Date - 2020-08-19T16:16:35+05:30 IST