లగ్జరీ కారును అమ్మేయాలనుకున్న సుశాంత్.. వైరల్ అవుతున్న ఆడియో టేప్!

ABN , First Publish Date - 2020-08-31T19:51:50+05:30 IST

బాలీవుడ్ యువ నటుడు సుశాంత్ సింగ్ రాజ్‌పుత్ కేసులో రోజుకో కొత్త విషయం వెలుగులోకి వస్తోంది

లగ్జరీ కారును అమ్మేయాలనుకున్న సుశాంత్.. వైరల్ అవుతున్న ఆడియో టేప్!

బాలీవుడ్ యువ నటుడు సుశాంత్ సింగ్ రాజ్‌పుత్ కేసులో రోజుకో కొత్త విషయం వెలుగులోకి వస్తోంది. ఈ కేసును ప్రస్తుతం సీబీఐ దర్యాప్తు చేస్తున్న సంగతి తెలిసిందే. ఈ క్ర‌మంలో సుశాంత్‌కు సంబంధించిన ఓ ఆడియో టేపు తాజాగా వెలుగులోకి వ‌చ్చింది. త‌న ఆర్థిక ప‌రిస్థితి గురించి సుశాంత్ ఆవేదన చెందినట్టు ఆ టేపు ద్వారా తెలుస్తోంది.


ఈ ఏడాది జ‌న‌వరిలో సుశాంత్, అత‌ని మేనేజ‌ర్లు, రియా చక్ర‌వ‌ర్తి మధ్య ఈ సంభాషణ జరిగింది. సుశాంత్ సంపాదనను ఎలా పొదుపు చేయాలనే దాని గురించి వారు చర్చించుకున్నారు. ఈ క్రమంలో తన లగ్జరీ కారును అమ్మేయాలనుకుంటున్నట్టు సుశాంత్ చెప్పాడు. కొన్ని రోజులు విశ్రాంతి తీసుకునేందుకు గోవా వెళ్లాలనుకున్నాడు. తన మానసిక, ఆర్థిక పరిస్థితి గురించి సుశాంత్ కలవరపాటుకు గురైనట్టు ఆ టేప్ ద్వారా తెలుస్తోంది. ఈ ఆడియో టేప్‌లోని గొంతు సుశాంత్‌దేన‌ని ఫోరెన్సిక్ నిపుణులు ఇప్పటికే ధ్రువీక‌రించారు. 

Updated Date - 2020-08-31T19:51:50+05:30 IST