సుశాంత్ సోదరి భావోద్వేగ పోస్ట్!

ABN , First Publish Date - 2020-07-27T21:51:03+05:30 IST

బాలీవుడ్ యువ నటుడు సుశాంత్ సింగ్ రాజ్‌పుత్ మరణానికి నాలుగు రోజుల ముందు జూన్ 10న అతనితో చేసిన ఛాటింగ్‌ను అతని సోదరి శ్వేతా సింగ్ బయటపెట్టారు

సుశాంత్ సోదరి భావోద్వేగ పోస్ట్!

బాలీవుడ్ యువ నటుడు సుశాంత్ సింగ్ రాజ్‌పుత్ మరణానికి నాలుగు రోజుల ముందు జూన్ 10న అతనితో చేసిన ఛాటింగ్‌ను అతని సోదరి శ్వేతా సింగ్ బయటపెట్టారు. ఆ వాట్సాప్ ఛాట్‌లో ఆమెరికా రమ్మని సుశాంత్‌ను శ్వేత రిక్వెస్ట్ చేశారు. తప్పకుండా రావాలనుకుంటున్నానని సుశాంత్ రిప్లై ఇచ్చాడు. తాజాగా సోదరుడిని గుర్తు చేసుకుంటూ శ్వేత సోషల్ మీడియాలో ఓ భావోద్వేగ పోస్ట్ పెట్టారు. తమ బాల్యాన్ని గుర్తు చేసుకున్నారు. 


`నేను పుట్టిన సంవత్సరం తర్వాత సుశాంత్ పుట్టాడు. మేమిద్దరం వేర్వేరు వ్యక్తులమని ఎవరూ అనుకునేవారు కాదు. అంతలా కలిసి పోయేవాళ్లం. అన్నింటి నుంచి అతడిని నేను కాపాడగలిగి ఉండేదాన్నేమో. నేను నిద్ర లేచి నా పక్కనే ఉన్న సుశాంత్‌ను చూస్తానని, ఇదంతా ఓ పీడకలేనని తెలుసుకుంటానని ఇప్పటికీ అనుకుంటుంటా` అంటూ ఓ సుదీర్ఘ లేఖను ఆమె ఇన్‌స్టాగ్రామ్‌లో పోస్ట్ చేశారు. సుశాంత్‌తో ఉన్న తన పాత ఫొటోలను పోస్ట్ చేశారు.  

Updated Date - 2020-07-27T21:51:03+05:30 IST

Read more