ప్రియురాలు రియా చక్రవర్తితో సుశాంత్ టూర్

ABN , First Publish Date - 2020-07-31T14:10:34+05:30 IST

బాలీవుడ్ నటుడు సుశాంత్ సింగ్ రాజ్‌పుత్ తన ప్రియురాలైన రియా చక్రవర్తితో కలిసి పలు ప్రాంతాల్లో పర్యటించారని తేలింది.....

ప్రియురాలు రియా చక్రవర్తితో సుశాంత్ టూర్

సుశాంత్ బ్యాంకు లావాదేవీలు బయటపెట్టిన ఛార్టర్డ్ అకౌంటెంట్

ముంబై : బాలీవుడ్ నటుడు సుశాంత్ సింగ్ రాజ్‌పుత్ తన ప్రియురాలైన రియా చక్రవర్తితో కలిసి పలు ప్రాంతాల్లో పర్యటించారని తేలింది. దివంగత నటుడు సుశాంత్ సింగ్ రాజ్‌పుత్ చార్టర్డ్ అకౌంటెంట్ అతని బ్యాంకు ఖాతా నుంచి చేసిన ఆర్థిక లావాదేవీల వివరాలను తాజాగా వెల్లడించారు. సుశాంత్ బ్యాంకు ఖాతా నుంచి అజ్ఞాత వ్యక్తుల బ్యాంకు ఖాతాకు రూ.15 కోట్లు బదిలీ అయ్యాయని, ఆ డబ్బును ప్రియురాలైన రియా చక్రవర్తి ఎవరికి బదిలీ చేసిందని సుశాంత్ తండ్రి ఆరోపించిన నేపథ్యంలో చార్టర్డ్ అకౌంటెంట్ తాజాగా బ్యాంకు ఖాతాలోని లావాదేవీలను బయటపెట్టారు. సుశాంత్ బ్యాంక్ ఖాతా నుంచి రియా చక్రవర్తికి పెద్దగా డబ్బు బదిలీలు జరగలేదని చార్టర్డ్ అకౌంటెంట్ వెల్లడించారు.సుశాంత్ బ్యాంక్ ఖాతాల నుంచి రియా లేదా ఆమె కుటుంబ సభ్యుల ఖాతాలకు లక్ష రూపాయల విలువైన లావాదేవీలు కూడా చేయలేదని సీఏ సందీప్ శ్రీధర్ చెప్పారు.సుశాంత్ సింగ్ తన ప్రియురాలైన రియా చక్రవర్తితో కలిసి పలు ప్రాంతాల్లో పర్యటించారని సీఏ విడుదల చేసిన బ్యాంకు లావాదేవీల్లో తేలింది. సుశాంత్ రియాచక్రవర్తితో కలిసి టూర్ కోసం రూ.4.87 లక్షలు వెచ్చించారు. విదేశీ పర్యటన కోసం మరో రూ.50లక్షలు ఖర్చు చేశారు. అసోం నుంచి కేరళ వరకు పర్యటనల కోసం సుశాంత్ తన బ్యాంకు ఖాతా నుంచి రూ.2.5కోట్లు ఖర్చు చేశారు. మిలాప్ కు సుశాంత్ రూ.9లక్షలు విరాళంగా ఇచ్చారు.లోనావాలా ఫాం హౌస్ అద్దె కింద రూ.26.40 లక్షలు, ఎస్టేట్ ఏజెంటుకు రూ.3.87 లక్షలు ఖర్చు చేశారు. కోటక్ మహీంద్రా బ్యాంకులో సుశాంత్ రూ.2కోట్ల టర్మ్ డిపాజిట్ పెట్టారు. 2019 జనవరి నుంచి జూన్ వరకు సుశాంత్ జీఎస్టీ, ఆదాయపు పన్ను కింద రూ.2.78 కోట్లు చెల్లించారు. 


Updated Date - 2020-07-31T14:10:34+05:30 IST