సుశాంత్‌సింగ్ ఈమ‌ధ్య‌ ఏక్తాక‌పూర్‌కు ఏమి చెప్పాడంటే...

ABN , First Publish Date - 2020-06-15T12:02:02+05:30 IST

హీరో సుశాంత్‌సింగ్ రాజ్‌పుత్ మృతితో బాలీవుడ్‌తో సహా టీవీ పరిశ్రమ శోకసంద్రంలో మునిగిపోయింది. ఈ వార్త వినగానే సుశాంత్ సింగ్ అభిమానులు

సుశాంత్‌సింగ్ ఈమ‌ధ్య‌ ఏక్తాక‌పూర్‌కు ఏమి చెప్పాడంటే...

హీరో సుశాంత్‌సింగ్ రాజ్‌పుత్ మృతితో బాలీవుడ్‌తో సహా టీవీ పరిశ్రమ శోకసంద్రంలో మునిగిపోయింది. ఈ వార్త  వినగానే సుశాంత్ సింగ్ అభిమానులు షాక్ అయ్యారు. సుశాంత్ టీవీ న‌టునిగా ప్ర‌వేశించి చిత్ర‌రంగంలో కాలుమోపారు. ఏక్తా కపూర్ రూపొందించిన‌ పాపులర్ షో ప‌విత్ర రిష్తాలో సుశాంత్ సింగ్‌ కనిపించారు. ఈ షోలో అంకితా లోఖండేతో అతను జ‌త‌క‌ట్ట‌డం ప్రేక్ష‌కుల‌కు బాగా న‌చ్చింది. సుశాంత్ సింగ్ రాజ్‌పుత్ ఆత్మహత్య చేసుకోవ‌డంతో ఏక్తాకపూర్ షాక్‌న‌కు గుర‌య్యారు. ఈ సంద‌ర్భంగా ఏక్తా ఇటీవ‌ల సుశాంత్ సోష‌ల్ మీడియాలో చేసిన పోస్టును తిరిగి పోస్టు చేశారు. తాము ప‌విత్ర రిష్తా సీరియ‌ల్‌లో కీల‌క పాత్ర‌కోసం చాలామందిని అనుకున్నామ‌ని, అయితే సుశాంత్ చిరున‌వ్వు న‌చ్చ‌డంతో అత‌నినే ఎంపిక చేశామ‌ని ఇటీవ‌ల ఏక్తా ఈ సీరియ‌ల్ స‌క్సెస్ గురించి చెబుతూ ఈ విష‌యాన్ని వెల్ల‌డించారు. దీనికి స్పందించిన సుశాంత్ సింగ్ ఏక్తా క‌పూర్‌ను ఉద్దేశిస్తూ... దీనికి నేను మీకు కృతజ్ఞతలు తెలియ జేస్తున్నాను మామ్.... అంటూ కామెంట్ పెట్టారు. ఇప్పుడు ఈ వ్యాఖ్య‌ను ఏక్తా షేర్ చేశారు. కాగా ముంబైలోని బాంద్రాలోగ‌ల‌ తన ఇంట్లో సుశాంత్‌సింగ్ రాజ్‌పుత్ ఉరి వేసుకుని ఆత్మహత్య చేసుకున్నారు. గత ఆరు నెలలుగా సుశాంత్ సింగ్‌ డిప్రెషన్‌లో ఉన్న‌ట్లు సినీ వర్గాలు చెబుతున్నాయి. 

Updated Date - 2020-06-15T12:02:02+05:30 IST