బీహార్ రాజ‌కీయాల్లోనూ సుశాంత్ ముద్ర‌

ABN , First Publish Date - 2020-06-15T14:35:02+05:30 IST

బాలీవుడ్ హీరో సుశాంత్ సింగ్ రాజ్‌పుత్ ఆత్మ‌హ‌త్య చేసుకున్న విష‌యం విదిత‌మే. సుశాంత్‌కు బీహార్ రాజకీయాలతో ప్రత్యేక సంబంధం ఉంది.

బీహార్ రాజ‌కీయాల్లోనూ సుశాంత్ ముద్ర‌

బాలీవుడ్ హీరో సుశాంత్ సింగ్ రాజ్‌పుత్ ఆత్మ‌హ‌త్య చేసుకున్న విష‌యం విదిత‌మే. సుశాంత్‌కు బీహార్ రాజకీయాలతో ప్రత్యేక సంబంధం ఉంది. ఛ‌తాపూర్ బీజెపీ ఎమ్మెల్యే నీరజ్ కుమార్ బాబ్లూకు సుశాంత్‌సింగ్ రాజ్‌పుత్ ద‌గ్గ‌రి బంధువు. అలాగే సుశాంత్‌ బావ అయిన‌ నూతన్ సింగ్ ఎల్‌జేపీకి చెందిన ఎంఎల్‌సీ. గత ఏడాది మేలో సుశాంత్ త‌న బావ‌ నూతాన్ సింగ్ ఇంటికి వ‌చ్చాడు. సుశాంత్ బాల్యంలో త‌న ఇంటినే క్రికెట్ మైదానంగా మార్చుకుని ఆడుకునేవాడు. సహర్సా వీధుల్లో బైక్ న‌డిపేవాడు. సుశాంత్ సింగ్ కుటుంబం ఉండే ఇల్లు, అతని తాత ఇల్లు బీహార్‌లో ఉన్నాయి. గత ఏడాది సుశాంత్ ఖగారియాలోని తన తాత ఇంటికి వ‌చ్చాడు.  ప్రతిభావంతుడైన‌ సుశాంత్ బీహార్‌కు పేరుతెచ్చాడు. ఇదే బీహార్‌కు చెందిన చిరాగ్ పాస్వాన్ బాలీవుడ్‌లో తన అదృష్టాన్ని ప‌రీక్షించుకున్నారు. కేవ‌లం ఒక సినిమా తర్వాత రాజ‌కీయాల్లోకి వెళ్లిపోయారు. 2013 లో బాలీవుడ్‌లోకి ప్రవేశించిన సుశాంత్ అతి తక్కువ సమయంలోనే ప్ర‌త్యేక‌‌ గుర్తింపు తెచ్చుకున్నాడు. గాడ్ ఫాదర్ లేకుండా సుశాంత్ బాలీవుడ్‌లో జండా ఎగుర‌వేశాడు. 

Updated Date - 2020-06-15T14:35:02+05:30 IST