సుశాంత్ `దిల్ బెచారా`@ రూ.1000 కోట్లు!

ABN , First Publish Date - 2020-07-29T21:43:21+05:30 IST

దివంగత నటుడు సుశాంత్ సింగ్ రాజ్‌పుత్ చివరి చిత్రం `దిల్ బెచారా` కళ్లు చెదిరే సంచలనాలు సృష్టిస్తోంది.

సుశాంత్ `దిల్ బెచారా`@ రూ.1000 కోట్లు!

దివంగత నటుడు సుశాంత్ సింగ్ రాజ్‌పుత్ చివరి చిత్రం `దిల్ బెచారా` కళ్లు చెదిరే సంచలనాలు సృష్టిస్తోంది. ఇటీవల డిస్నీ+హాట్‌స్టార్‌లో విడుదలైన ఈ చిత్రం రికార్డ్ వ్యూయర్ షిప్‌ను సొంతం చేసుకుంది. సబ్‌స్క్రైబర్లు, నాన్-సబ్‌స్క్రైబర్లు అందరూ ఉచితంగా చూసేలా ఈ సినిమాను డిస్నీ+హాట్‌స్టార్‌ సంస్థ ఉచితంగా అందుబాటులో ఉంచింది. దీంతో ఈ సినిమా 24 గంటల్లో ఏకంగా తొమ్మిదిన్నర కోట్ల వ్యూస్‌ సాధించింది. 


ఈ విషయంలో ప్రపంచవ్యాప్తంగా మంచి క్రేజ్ కలిగిన `గేమ్ ఆఫ్ థ్రోన్స్`ను కూడా`దిల్ బెచారా` దాటేసిందట. అలాగే 10/10 ఐఎమ్‌డీబీ రేటింగ్ సాధించి మరో రికార్డును కూడా తన ఖాతాలో వేసుకుంది. ఒకవేళ ఈ సినిమా కనుక థియేటర్లలో విడుదలై ఉంటే తొలి రోజే వెయ్యి కోట్లకు పైచిలుకు వసూళ్లు సాధించేదని బాలీవుడ్ ట్రేడ్ అనలిస్టులు అభిప్రాయపడుతున్నారు. 


Updated Date - 2020-07-29T21:43:21+05:30 IST