సుశాంత్ కేసులో మ‌హేష్‌భ‌ట్ పేరు... స్పందించిన అనుప‌మ్‌ఖేర్‌!

ABN , First Publish Date - 2020-08-17T10:42:03+05:30 IST

నటుడు సుశాంత్ సింగ్ రాజ్‌పుత్ ఆత్మ‌హ‌త్య అనంత‌రం బాలీవుడ్‌లో బంధుప్రీతి అంశం చ‌క్క‌ర్లు కొడుతోంది. ఈ నేప‌ధ్యంలో కొంతమంది బాలీవుడ్...

సుశాంత్ కేసులో మ‌హేష్‌భ‌ట్ పేరు... స్పందించిన అనుప‌మ్‌ఖేర్‌!

నటుడు సుశాంత్ సింగ్ రాజ్‌పుత్ ఆత్మ‌హ‌త్య అనంత‌రం బాలీవుడ్‌లో బంధుప్రీతి అంశం చ‌క్క‌ర్లు కొడుతోంది. ఈ నేప‌ధ్యంలో కొంతమంది బాలీవుడ్ ప్రముఖుల పేర్లు బ‌య‌ట‌కు వ‌చ్చాయి.  ఈ జాబితాలో కరణ్ జోహార్, మహేష్ భట్, జావేద్ అక్తర్ త‌దితరుల పేర్లు వినిపించాయి. రియా చక్రవర్తికి ద‌ర్శ‌కుడు మహేష్ భట్ స‌న్నిహితుడ‌నే వార్తలు వినిపిస్తున్నాయి. దీనిపై మహేష్ భట్ స్నేహితుడు, నటుడు అనుపమ్ ఖేర్ స్పందించారు. ఒక మీడియా సంస్థ‌కు ఇచ్చిన ఇంటర్వ్యూలో అనుపమ్... తాను ఏదో ఒక‌టి నిరూప‌ణ జ‌రిగేవ‌ర‌కూ ఏమీ మాట్లాడ‌న‌ని అన్నారు. అయితే మహేష్ భ‌ట్‌కు కృతజ్ఞతలు. ఆయ‌న నాకు ఎంతో చేశారు. నేను గుడ్డివాడిని కాదు. కానీ ఇప్పుడు ఏమీ అనను. మ‌న‌కు సాయం అందించిన చేతుల‌ను ఎప్పుడూ తృణీక‌రించ‌వ‌ద్ద‌ని నా కుటుంబం నాకు నేర్పింద‌ని అన్నారు. కాగా సుశాంత్ ఆత్మ‌హ‌త్య కేసులో మహేష్ భట్‌ను కూడా సీబీఐ ప్రశ్నించిన విషయం తెలిసిందే. రియాతో మహేష్ భట్ సన్నిహితంగా ఉంటారని తెలుస్తోంది. ఇలాంటి పరిస్థితిలో ఆయనపై అనేక రకాల ఆరోపణలు వినిపిస్తున్నాయి. సోషల్ మీడియాలో ఈ దర్శకుడిని ఘోరంగా ట్రోల్ చేస్తున్నారు. ఇటీవల అతని చిత్రం సడక్- 2 ట్రైలర్ విడుదలైంది. దీనిపై అభిమానులు వ్యాఖ్యానాల దాడులు చేస్తున్నారు. అలాగే మ‌హేష్‌భ‌ట్ కుమార్తె అలియా, భార్య సోని రజ్దాన్‌లపై కూడా విమ‌ర్శ‌లు గుప్పిస్తున్నారు. 

Updated Date - 2020-08-17T10:42:03+05:30 IST