కుక్కబెల్టుతో సుశాంత్‌ను చంపేశారు.. మాజీ అసిస్టెంట్ ఆరోపణ!

ABN , First Publish Date - 2020-08-08T01:59:54+05:30 IST

ఇటీవల ఆత్మహత్య చేసుకున్న బాలీవుడ్ స్టార్ సుశాంత్ సింగ్ రాజ్‌పుత్ కేసుపై అతని మాజీ అసిస్టెట్ అంకిత్ ఆచార్య షాకింగ్ కామెంట్స్ చేశాడు.

కుక్కబెల్టుతో సుశాంత్‌ను చంపేశారు.. మాజీ అసిస్టెంట్ ఆరోపణ!

ముంబై: ఇటీవల ఆత్మహత్య చేసుకున్న బాలీవుడ్ స్టార్ సుశాంత్ సింగ్ రాజ్‌పుత్ కేసుపై అతని మాజీ అసిస్టెంట్ అంకిత్ ఆచార్య షాకింగ్ కామెంట్స్ చేశాడు. సుశాంత్‌ది సూసైడ్ కాదని, హత్య అని అంకిత్ ఆరోపించాడు. ఈ కేసును సీబీఐకి అప్పగించడంపై హర్షం వ్యక్తంచేసిన అంకిత్.. నిందితులకు ఉరిశిక్ష వేయాలని డిమాండ్ చేశాడు. ‘సుశాంత్‌ను అతని పెంపుడు కుక్క బెల్టుతో ఉరివేసి చంపారు. ఇలా గొంతు నులిమి చంపితేనే మృతుడి మెడపై వృత్తాకారంలో గుర్తులుంటాయి. సుశాంత్ మెడపై అలాంటి గుర్తులే ఉన్నాయి’ అని అంకిత్ పేర్కొన్నాడు.

Updated Date - 2020-08-08T01:59:54+05:30 IST

Read more