ఆకలితో అలమటిస్తున్న సూర్యకాంత్‌

ABN , First Publish Date - 2020-08-17T16:07:48+05:30 IST

ఆకలితో అలమటిస్తున్న సూర్యకాంత్‌

ఆకలితో అలమటిస్తున్న సూర్యకాంత్‌

కరోనా లాక్‌డౌన్‌ కారణంగా తమిళ నటుడు సూర్యకాంత్‌ పూటగడవని స్థితిలో పస్తులతో గడుపుతున్నారు. లాక్‌డౌన్‌ అమలు చేయడంతో మార్చి నెలాఖరు నుంచి సినిమా షూటింగ్‌లు ఆగిపోయాయి. ధియేటర్లు మూతపడ్డాయి. దీంతో వేలాదిమంది సినీ కళాకారులు, జూనియర్‌ ఆర్టిస్టులు ఉపాధి లేక పూటకింత భోజనం లభించక కష్టపడుతున్నారు. కె.భాగ్యరాజ్‌ దర్శకత్వం వహించిన సూపర్‌హిట్‌ చిత్రం ‘తూరల్‌ నిన్నుపోచ్చు’లో విలన్‌గా పరిచయమైన నటుడు సూర్యకాంత్‌. తాజా చిత్రం ఖైదీలోనూ, విజయ్‌సేతుపతి నటించిన ‘సంగ తమిళన్‌’ చిత్రంలోనూ నటించారు. ప్రస్తుతం లాక్‌డౌన్‌ వల్ల సూర్యకాంత్‌ పరిస్థితి దయనీయంగా మారింది. షూటింగ్‌లు లేకపోవడంతో రోజూ పస్తులతో గడుపుతున్నానని, మధుమేహంతో బాధపడుతున్నానని దాతలెవరైనా తనను ఆదుకోవాలని కన్నీటి పర్యంతమై సినీ రంగ ప్రముఖులకు విజ్ఞప్తి చేస్తున్నారు.

Updated Date - 2020-08-17T16:07:48+05:30 IST