సూర్యా...ఆలోచించుకో...

ABN , First Publish Date - 2020-08-27T05:35:53+05:30 IST

సూర్య నటించిన ‘ఆకాశం నీ హద్దురా’ చిత్రాన్ని ఓటీటీలో విడుదల చేసే విషయంలో మరోసారి ఆలోచించి నిర్ణయం తీసుకోవాలని కోరుతూ తమిళ దర్శకుడు హరి సూర్యకు లేఖ రాశారు...

సూర్యా...ఆలోచించుకో...

సూర్య నటించిన ‘ఆకాశం నీ హద్దురా’ చిత్రాన్ని ఓటీటీలో విడుదల చేసే విషయంలో మరోసారి ఆలోచించి నిర్ణయం తీసుకోవాలని కోరుతూ తమిళ దర్శకుడు హరి సూర్యకు లేఖ రాశారు. వీరిద్దరి కలయికలో వచ్చిన ‘సింగమ్‌’ సిరీస్‌ చిత్రాలకు తమిళ, తెలుగు భాషల్లో మంచి ఆదరణ దక్కింది. ఓటీటీ ప్లాట్‌ఫామ్‌లో సినిమాలు విడుదల చేయడంలో మొదటి నుంచి పట్టుదలతో ఉన్న సూర్య ‘ఆకాశం నీ హద్దురా’ చిత్రాన్ని అమెజాన్‌ ప్రైమ్‌లో సెప్టెంబర్‌ 30 న విడుదల చేయనున్నట్టు ప్రకటించారు. ‘‘సూర్య చిత్రాలను పెద్ద తెరపై చూస్తేనే బాగుంటుందనేది ఆయన అభిమానిగా నా కోరిక, అందుకే ఈ విషయంలో పునరాలోచించుకోవాలని ఆయన్ను కోరుతున్నాను’’ అని హరి తెలిపారు. ఎయిర్‌డెక్కన్‌ వ్యవస్థాపకుడు జీ ఆర్‌ గోపీనాథ్‌ జీవిత కథ ఆధారంగా ఈ చిత్రం తెరకెక్కించారు.

Updated Date - 2020-08-27T05:35:53+05:30 IST