మీరు ఎంతో మందికి స్ఫూర్తి సర్: సూర్య

ABN , First Publish Date - 2020-11-13T19:02:12+05:30 IST

ఎయిర్‌ డెక్కన్‌ అధినేత జీఆర్‌ గోపీనాథ్‌ ఆత్మకథ `సింప్లి ఫ్లై` ఆధారంగా తెరకెక్కిన తాజా చిత్రం `ఆకాశం నీ హద్దురా`.

మీరు ఎంతో మందికి స్ఫూర్తి సర్: సూర్య

ఎయిర్‌ డెక్కన్‌ అధినేత జీఆర్‌ గోపీనాథ్‌ ఆత్మకథ `సింప్లి ఫ్లై` ఆధారంగా తెరకెక్కిన తాజా చిత్రం `ఆకాశం నీ హద్దురా`.  సుధా కొంగర దర్శకత్వంలో సూర్య నటించిన ఈ చిత్రం ఇటీవల ప్రైమ్ వీడియోస్ ద్వారా ప్రేక్షకుల ముందుకు వచ్చింది. విడుదలైన అన్ని భాషల్లోనూ మంచి టాక్ సంపాదించుకుంది. ఈ సినిమా చూసిన గోపీనాథ్ తాజాగా ట్విటర్ ద్వారా స్పందించారు. 


గత రాత్రి `ఆకాశమే నీ హద్దురా` సినిమా చూశానని, గతాన్ని గుర్తు చేశారని, భావోద్వేగాలను అద్భుతంగా పండించారని ప్రశంసించారు. దర్శకురాలు సుధా కొంగర, హీరో సూర్య, హీరోయిన్ అపర్ణ‌ను ప్రశంసించారు. గోపీనాథ్ ట్వీట్‌పై తాజాగా సూర్య స్పందించాడు. `ప్రియమైన కెప్టెన్.. సినిమా మీకు నచ్చినందుకు చాలా సంతోషంగా ఉంది. మీ నమ్మకానికి, దేశానికి మీరు చేసిన సేవకు ఇది మా తరఫున చిన్న గౌరవం. మరెంతో మంది స్ఫూర్తి పొందుతారని ఆశిస్తున్నా` అంటూ సూర్య పేర్కొన్నాడు.  Updated Date - 2020-11-13T19:02:12+05:30 IST