‘డర్టీ హరి’.. దుమ్మురేపుతున్నాడట

ABN , First Publish Date - 2020-12-21T03:22:25+05:30 IST

కరోనా లాక్‌డౌన్‌తో ఇప్పుడు ఓటీటీ, ఏటీటీల హడావుడి మొదలైంది. వారానికో సినిమా ప్లాన్‌ చేస్తూ.. మధ్యలో వెబ్‌ సిరీస్‌లంటూ.. ఓటీటీలు ప్రేక్షకులను ఆకర్షించే ప్రయత్నం

‘డర్టీ హరి’.. దుమ్మురేపుతున్నాడట

కరోనా లాక్‌డౌన్‌తో ఇప్పుడు ఓటీటీ, ఏటీటీల హడావుడి మొదలైంది. వారానికో సినిమా ప్లాన్‌ చేస్తూ.. మధ్యలో వెబ్‌ సిరీస్‌లంటూ.. ఓటీటీలు ప్రేక్షకులను ఆకర్షించే ప్రయత్నం చేస్తున్నాయి. ఈ క్రమంలోనే సీనియర్ నిర్మాత, దర్శకుడు ఎమ్మెస్ రాజు తను దర్శకత్వం వహించిన 'డర్టీ హరి' సినిమాని ఫ్రైడే మూవీస్ అనే ఏటీటీ(ఎనీ టైమ్ థియేటర్) ద్వారా విడుదల చేశారు. ఈ చిత్రం డిసెంబర్ 18 సాయంత్రం 6 గంటలకు విడుదలైంది. రొమాంటిక్ సస్పెన్స్ డ్రామాగా తెరకెక్కిన ఈ చిత్రానికి ప్రేక్షకుల నుంచి అద్భుతమైన రెస్పాన్స్‌ వచ్చినట్లుగా చిత్రయూనిట్‌, అలాగే ఫ్రైడే మూవీస్‌ ఏటీటీ సంస్థ అధికారికంగా ప్రకటించింది.


శ్రవణ్ రెడ్డి, రుహానీ శర్మ, సిమ్రత్ కౌర్ ప్రధాన పాత్రల్లో వచ్చిన ఈ బోల్డ్ రొమాన్స్ డ్రామాకు పాజిటివ్ రెస్పాన్స్ వచ్చిందని... ఫ్రైడే మూవీస్ ఏటిటిలో విడుదలైన ఈ చిత్రం 24 గంటల్లో 91818 వ్యూస్ దక్కించుకుందని తెలుపుతూ అధికారికంగా చిత్రయూనిట్‌ ఓ పోస్టర్‌ను విడుదల చేసింది. ఇక ఈ ఏటీటీ ప్రత్యేకత ఏమిటంటే.. ఒక్క టికెట్ తీసుకుంటే ఎంతమంది ఎన్నిసార్లైనా 24 గంటల టైమ్‌లో సినిమాని చూడవచ్చట. సినిమాకు మంచి టాక్ రావడంతో వ్యూస్ మరింతగా పెరుగుతాయని నమ్మకంగా ఉన్నట్లుగా దర్శక నిర్మాతలు తెలుపుతున్నారు.

Updated Date - 2020-12-21T03:22:25+05:30 IST