నిజంగా సంతోషంగా ఉంది: మహేష్ బాబు

ABN , First Publish Date - 2020-07-03T22:56:26+05:30 IST

సూప‌ర్ స్టార్ మహేశ్‌బాబును సామాజిక మాధ్యమ వేదిక ట్విట్టర్‌లో ఫాలో అయ్యే వారి సంఖ్య 10మిలియ‌న్‌ని క్రాస్ అయింది. ఈ రికార్డు ప‌ట్ల‌ మ‌హేశ్ ఫ్యాన్స్ హ్యాపీగా ఉన్నారు. సాదార‌ణంగా

నిజంగా సంతోషంగా ఉంది: మహేష్ బాబు

సూప‌ర్ స్టార్ మహేశ్‌బాబును సామాజిక మాధ్యమ వేదిక ట్విట్టర్‌లో ఫాలో అయ్యే వారి సంఖ్య 10మిలియ‌న్‌ని క్రాస్ అయింది. ఈ రికార్డు ప‌ట్ల‌ మ‌హేశ్ ఫ్యాన్స్ హ్యాపీగా ఉన్నారు. సాదార‌ణంగా మ‌హేశ్ ట్విట్ట‌ర్‌లో యాక్టివ్‌గా ఉంటారు. ఆయ‌న‌ను ఫాలో అయ్యే వారి సంఖ్య రోజురోజుకి పెరుగుతోంది. అయితే సౌత్ ఇండియాలో 10 మిలియన్ ఫాలోవర్స్ సాధించిన స్టార్ హీరోగా మహేష్ బాబు ఇప్పుడు రికార్డ్ నెలకొల్పారు. తనకి వచ్చిన ఈ ఆదరణ పట్ల మహేష్ బాబు కూడా సంతోషం వ్యక్తం చేశారు. తనని ఫాలో అవుతున్న అందరికీ కృతజ్ఞతలు తెలుపుతున్నట్లుగా మహేష్ బాబు ట్వీట్ చేశారు.


‘‘నా మనసులోని కృతజ్ఞతాభావాన్ని వివరించి చెప్పడానికి 10 మిలియన్ల ధన్యవాదాలు కూడా సరిపోవు. మీ అందరితో వర్చువల్‌గా ఇలా కనెక్ట్ అయినందుకు నిజంగా చాలా సంతోషిస్తున్నాను. ఎంతో ప్రేమతో అందరికీ ధన్యవాదాలు. 10 మిలియన్ల బలాన్నిచ్చారు’’ అని మహేష్ తన ట్వీట్‌లో పేర్కొన్నారు. ఈ ట్వీట్ ఇప్పుడు సోషల్ మీడియాలో ట్రెండింగ్ అవుతోంది.Updated Date - 2020-07-03T22:56:26+05:30 IST