సన్నీలియోన్‌ ‘బుల్లెట్స్‌’

ABN , First Publish Date - 2020-10-21T10:32:28+05:30 IST

అందాల తారగానే కాదు, యాక్షన్‌ హీరోయిన్‌గానూ సత్తా చూపిస్తున్నారు సన్నీలియోన్‌. తాజాగా ఆమె నటిస్తున్న వెబ్‌సిరీస్‌ ‘బుల్లెట్స్‌’ ట్రైలర్‌ విడుదలైంది...

సన్నీలియోన్‌ ‘బుల్లెట్స్‌’

అందాల తారగానే  కాదు, యాక్షన్‌ హీరోయిన్‌గానూ సత్తా చూపిస్తున్నారు సన్నీలియోన్‌. తాజాగా ఆమె నటిస్తున్న వెబ్‌సిరీస్‌ ‘బుల్లెట్స్‌’ ట్రైలర్‌ విడుదలైంది. ఇండియా, మలేషియాలోని బ్యూటిఫుల్‌ లొకేషన్లలో ఈ వెబ్‌సిరీస్‌ను భారీగా తెరకెక్కించారు. కరిష్మాఖన్నాతో కలసి సన్నీ చేసిన సాహసాలను ట్రైలర్‌లో ఓ రేంజ్‌లో చూపించారు. అక్రమ ఆయుధాల వ్యాపారం చేసే నేరస్తులను పట్టుకోవడానికి ఏర్పాటు చేసిన మిషన్‌లో కరిష్మా, సన్నీలియోన్‌ పని చేస్తుంటారు. రాజకీయ నాయకులు, పోలీసుల ఒత్తిళ్లను తట్టుకొని వారు ఎలా విజయం సాఽధించారు, దాని కోసం వారు చేసిన సాహసాల నేపథ్యంలో కథ సాగుతుంది. ఈనెల 30 న ‘బుల్లెట్స్‌’ ఎంఎక్స్‌ ప్లేయర్‌లో స్ట్రీమింగ్‌ అవుతుంది.

Updated Date - 2020-10-21T10:32:28+05:30 IST