అవగాహన పెంచే పనిలో భాగమైన సన్నీలియోన్‌

ABN , First Publish Date - 2020-10-27T16:01:56+05:30 IST

తాజాగా బాలీవుడ్‌ నటి సన్నీలియోన్‌ ఇలాంటి ఓ కార్యక్రమంలో పాలుపంచుకుని తన మంచి మనసుని చాటుకున్నారు. వివరాల్లోకెళ్తే..

అవగాహన పెంచే పనిలో భాగమైన సన్నీలియోన్‌

సినీ సెలబ్రిటీలందరూ సామాజిక సేవా కార్యక్రమాల్లో భాగమవుతూ, పలు విషయాలపై అందరిలో అవగాహన పెంచుతున్న విషయాలను మనం గమనిస్తూనే ఉన్నాం. తాజాగా బాలీవుడ్‌ నటి సన్నీలియోన్‌ ఇలాంటి ఓ కార్యక్రమంలో పాలుపంచుకుని తన మంచి మనసుని చాటుకున్నారు. వివరాల్లోకెళ్తే.. మేకప్‌ ఆర్టిస్ట్‌ అర్వా బైగ్‌ తయారు చేసిన ఓ ఇన్‌స్టా వీడియో సన్నీలియోన్ భాగమై బ్రెస్ట్‌ క్యానర్సర్‌కు సంబంధించిన అవగాహన కల్పించారు. ఈ వీడియోలోకాన్సర్‌తో పోరాడుతున్న ముగ్గురు వ్యక్తులు మాట్లాడారు. వారు వ్యక్తిగత, మానసిక పరిస్థితులను వివరించారు. అర్వా వారిని మానసికంగా బలంవంతులుగా చేయడానికి తన వంతుగా సాయాన్ని అందిస్తున్నారు. ఇలాంటి ఓ అవగాహన కార్యక్రమంలో పాల్గొన్న సన్నీలియోన్‌కి అర్వా ధన్యవాదాలు తెలిపారు. సన్నీలియోన్‌ కూడా అర్వా చాలా అద్భుతమైన పనిచేశారంటూ అభినందించారు. 


Updated Date - 2020-10-27T16:01:56+05:30 IST