సినీనటుడు, ఎంపీ సన్నిడియోల్‌కు కరోనా పాజిటివ్

ABN , First Publish Date - 2020-12-02T12:19:43+05:30 IST

బాలీవుడ్ ప్రముఖ సినీనటుడు, గురుదాస్ పూర్ బీజేపీ ఎంపీ సన్నీ డియోల్ కొవిడ్-19 పాజిటివ్ బారిన పడ్డారు...

సినీనటుడు, ఎంపీ సన్నిడియోల్‌కు కరోనా పాజిటివ్

సిమ్లా (హిమాచల్ ప్రదేశ్): బాలీవుడ్ ప్రముఖ సినీనటుడు, గురుదాస్ పూర్ బీజేపీ ఎంపీ సన్నీ డియోల్ కొవిడ్-19 పాజిటివ్ బారిన పడ్డారు. హిమాచల్ ప్రదేశ్ రాష్ట్రంలోని కుల్లూ జిల్లాలో గత కొన్ని రోజులుగా ఉంటున్న సన్నీడియోల్ కు పరీక్షిస్తే కరోనా పాజిటివ్ అని తేలిందని హిమాచల్ ప్రదేశ్ ఆరోగ్య కార్యదర్శి అమితాబ్ అవస్థీ చెప్పారు. ఎంపీ సన్నీడియోల్, అతని స్నేహితులు కుల్లూ జిల్లా నుంచి ముంబై నగరానికి వెళ్లాలనుకున్నారు. కాని సన్నీడియోల్ కరోనా పరీక్ష చేయించుకోగా అతనికి పాజిటివ్ అని తేలిందని ఆరోగ్య కార్యదర్శి చెప్పారు. 64 ఏళ్ల సన్నీడియోల్ ముంబైలో భుజానికి శస్త్రచికిత్స చేయించుకొని  విశ్రాంతి తీసుకునేందుకు కుల్లూ జిల్లాలోని మనాలీ సమీపంలోని ఫాం హౌస్ లో గడపగా, ఆయన కరోనా బారిన పడ్డారు.

Updated Date - 2020-12-02T12:19:43+05:30 IST