ఎంపీ అయిన ప్రముఖ సినీహీరో సన్నీడియోల్ వివాదాస్పద వ్యాఖ్యలు

ABN , First Publish Date - 2020-02-18T13:25:46+05:30 IST

రాజకీయనాయకుడిగా మారిన బాలీవుడ్ ప్రముఖ హీరో సన్నీడియోల్ వివాదాస్పద వ్యాఖ్యలు చేశారు....

ఎంపీ అయిన ప్రముఖ సినీహీరో సన్నీడియోల్ వివాదాస్పద వ్యాఖ్యలు

పటాన్‌కోట్ (పంజాబ్) : రాజకీయనాయకుడిగా మారిన బాలీవుడ్ ప్రముఖ హీరో సన్నీడియోల్ వివాదాస్పద వ్యాఖ్యలు చేశారు. ‘‘తప్పుడు వ్యక్తిని పార్లమెంటు ఎన్నికల్లో గెలిపించారని కొందరు వ్యాఖ్యలు చేశారని, కాని ఎవరినైనా కొట్టేటప్పుడు నా కన్నా గొప్పవారు ఎవరూ లేరు’’ అని గురుదాస్‌పూర్ ఎంపీ అయిన సన్నీడియోల్ వ్యాఖ్యానించారు. పటాన్‌కోట్ నగరంలో జరిగిన ర్యాలీలో సన్నీడియోల్ ఈ వ్యాఖ్యలు చేశారు. సినీహీరోను నాయకుడిని తీసుకువచ్చిన బీజేపీదే తప్పని భోవా అసెంబ్లీ ఎమ్మెల్యే జోగిందర్ పాల్ సింగ్ వ్యాఖ్యానించారు. ‘‘సన్నీడియోల్ కు రాజకీయాలపై అవగాహన లేదు, సినిమాల్లోలాగా సన్నీ డాన్స్ చేయడానికి ఉపయోగపడుతున్నాడు. ఇతన్ని రాజకీయాల్లోకి తీసుకువచ్చిన బీజేపీదే తప్పు’’ అని కాంగ్రెస్ ఎమ్మెల్యే జోగిందర్ పాల్ సింగ్ ఆరోపించారు. ఈ నెల 13వతేదీన పటాన్ కోట్ రైల్వేస్టేషనులో ఎంపీ సన్నీడియోల్ కనిపించడం లేదు అంటూ పోస్టర్లు వేశారు. దీంతో ప్రజల సమస్యలు తెలుసుకునేందుకు వచ్చానని సన్నీడియోల్ చెప్పారు.గురుదాస్‌పూర్ పార్లమెంటు నియోజకవర్గం నుంచి పోటీ చేసిన సన్నీడియోల్ కాంగ్రెస్ అభ్యర్థి సునీల్ జాఖర్ ను 82,459 ఓట్ల తేడాతో ఓడించారు. ప్రజలను కలిసి వారి సమస్యలను తెలుసుకునేందుకు మూడురోజుల పాటు పర్యటిస్తున్నట్లు సన్నీడియోల్ వివరించారు.

Updated Date - 2020-02-18T13:25:46+05:30 IST