భన్సాలీ, శేఖర్‌కపూర్‌లకు సమన్లు!

ABN , First Publish Date - 2020-07-03T05:04:50+05:30 IST

సుశాంత్‌సింగ్‌ రాజ్‌పుత్‌ ఆత్మహత్య కేసులో ముంబై పోలీసులు ఇప్పటికే కుటుంబ సభ్యులు, స్నేహితులు, సన్నిహితులను కలిపి 28 మందిని విచారించారు...

భన్సాలీ, శేఖర్‌కపూర్‌లకు సమన్లు!

సుశాంత్‌సింగ్‌ రాజ్‌పుత్‌ ఆత్మహత్య కేసులో ముంబై పోలీసులు ఇప్పటికే కుటుంబ సభ్యులు, స్నేహితులు, సన్నిహితులను కలిపి 28 మందిని విచారించారు. ఇప్పుడు బాలీవుడ్‌ అగ్ర దర్శకుడు సంజయ్‌ లీలా భన్సాలీని కూడా విచారించేందుకు ముంబై పోలీసులు సిద్ధమవుతున్నారు. ఇప్పటికే సంజయ్‌కు సమన్లు అందినట్లు సమాచారం. త్వరలో భనాల్సీని పోలీసులు విచారించే అవకాశం ఉంది. భనాల్సి దర్శకత్వం వహించిన ‘బాజీరావ్‌ మస్తానీ’, ‘రామ్‌లీలా’ చిత్రాల్లో సుశాంత్‌కి అవకాశం వచ్చినప్పటికీ యశ్‌రాజ్‌ సంస్థలో కాంట్రాక్ట్‌ ఉండటం వల్ల సుశాంత్‌ ఆ చిత్రాల్లో సపోర్టింగ్‌ రోల్‌ చేయలేకపోయారు. భనాల్సీ సుశాంత్‌తో పలు చిత్రాలు చేస్తానని మాటిచ్చి కార్యరూపం దాల్చకపోవడం కూడా ఆయనను ప్రశ్నించడానికి ఓ కారణమని బాలీవుడ్‌ వర్గాలు చెబుతున్నాయి. భన్సాలీతోపాటు సుశాంత్‌తో ‘పానీ’ చిత్రం తీసిన శేఖర్‌ కపూర్‌ను కూడా పోలీసులు విచారిస్తారని తెలుస్తోంది.. 

Updated Date - 2020-07-03T05:04:50+05:30 IST