వారికి అండగా ఉండండి: సుమన్

ABN , First Publish Date - 2020-08-27T00:29:35+05:30 IST

ప్రస్తుతం కష్టాల్లో ఉన్న ప్రజలకు అండగా నిలవాలని తన అభిమానులకు ప్రముఖ నటుడు సుమన్ సూచించారు

వారికి అండగా ఉండండి: సుమన్

ప్రస్తుతం కష్టాల్లో ఉన్న ప్రజలకు అండగా నిలవాలని తన అభిమానులకు ప్రముఖ నటుడు సుమన్ సూచించారు. శుక్రవారం సుమన్ పుట్టినరోజు. ఈ సందర్భంగా సుమన్ మాట్లాడుతూ.. `ప్రతి ఏడాది నా బర్త్‌డే రోజున అభిమానులు కేకులు కట్ చేయడం, పలు ఇతర కార్యక్రమాల్లో పాల్గొనడం వంటివి చేస్తుంటారు. అయితే ఈ సారి కరోనా కారణంగా ఆ పరిస్థితి లేదు. కాబట్టి అభిమానులు నా జన్మదినోత్సవ వేడుకలు జరపవద్ద`ని విజ్ఞప్తి చేశారు.


వీలైతే ప్రజల కోసం అహర్నిశలు కృషి చేస్తున్న డాక్టర్లకు, పోలీసులకు, వైద్య సిబ్బందికి అండగా ఉండాలని కోరారు. లాక్‌డౌన్ కారణంగా చాలా రోజులు ఇంటికే పరిమితమయ్యానని, తన నట జీవితంలో ఇన్ని రోజులు షూటింగ్‌కు దూరంగా ఎప్పుడూ లేనని  అన్నారు. త్వరలోనే పరిస్థితులు అనుకూలంగా మారతాయని సుమన్ ఆశాభావం వ్యక్తం చేశారు.

Updated Date - 2020-08-27T00:29:35+05:30 IST