క్రేజీ కాంబో..సుక్కు, విజయ్‌ దేవరకొండ ప్యాన్‌ ఇండియా మూవీ

ABN , First Publish Date - 2020-09-28T17:08:09+05:30 IST

యూత్‌లో మంచి ఇమేజ్‌ ఉన్న హీరోల్లో విజయ్‌ దేవరకొండ ఒకరు. ఇక డైరెక్టర్స్‌లో సుకుమార్‌ది ఓ ప్రత్యేకమైన శైలి. వీరిద్దరి కాంబినేషన్‌లో సినిమా రూపొందనుంది.

క్రేజీ కాంబో..సుక్కు, విజయ్‌ దేవరకొండ ప్యాన్‌ ఇండియా మూవీ

యూత్‌లో మంచి ఇమేజ్‌ ఉన్న హీరోల్లో విజయ్‌ దేవరకొండ ఒకరు. ఇక డైరెక్టర్స్‌లో సుకుమార్‌ది ఓ ప్రత్యేకమైన శైలి. వీరిద్దరి కాంబినేషన్‌లో సినిమా రూపొందనుంది. ఈ విషయాన్ని చిత్ర యూనిట్ అధికారికంగా ప్రకటించింది. "నాలో నటుడు చాలా ఎగ్జయింట్‌గా వెయిట్‌ చేస్తున్నాడు. నాలోని ప్రేక్షకుడు సెలబ్రేట్‌ చేసుకుంటున్నాడు. మీ అందరికీ గుర్తుండిపోయే సినిమాను ఇస్తామని గ్యారంటీ ఇస్తున్నాను. సుక్కుగారితో సెట్స్‌లో ఎప్పుడెప్పుడు కలుద్దామా! అని ఎదురుచూస్తున్నాను. హ్యాపీ బర్త్‌ డే కేదార్‌. నువ్వు మంచి స్నేహితుడివి. ఎంతో హార్డ్‌ వర్క్‌ చేస్తావు" అంటూ విజయ్‌ దేవరకొండ ట్వీట్‌ చేశారు. 


 


ఫాల్కన్‌ క్రియేషన్స్ బ్యానర్‌పై కేదార్‌ సెలగం శెట్టి ఈ చిత్రాన్ని నిర్మిస్తున్నారు. ఈ సందర్భంగా నిర్మాత మాట్లాడుతూ "ఈ పుట్టిన రోజు నాకు చాలా స్పెషల్.నాకు ఎంతో ఇష్టమైన వ్యక్తులు విజయ్ దేవరకొండ, సుకుమార్‌గారితో నా మొదటి సినిమా అనౌన్స్ చేస్తున్నందుకు చాలా సంతోషం గా ఉంది. ఈ సినిమా 2022 లో మొదలు కాబోతుంది. పాన్ ఇండియా ప్రాజెక్ట్‌గా ఈ సినిమా ఉండబోతుంది.ఈ కాంబినేషన్ అనగానే అందరికి చాలా అంచనాలుంటాయి.విజయ్ ,సుకుమార్..ఇద్దరూ కొత్తదనాన్ని బాగా ఇష్టపడతారు. వాళ్ళ సినిమాలు కుడా అలాగే ఉంటాయి.వాళ్ళిద్దరి కలయిక లో వస్తున్న ఈ సినిమా కూడా వాళ్ళ స్టైల్ లోనే ఉంటుంది. ఈ సినిమాకు సంబంధించి మిగతా వివరాలు తర్వాత తెలియజేస్తాం" అని అన్నారు.




2022లో ఈ సినిమాను సుకుమార్‌ తెరకెక్కించనున్నారు. ప్రస్తుతం అల్లు అర్జున్‌తో 'పుష్ప' సినిమాను తెరకెక్కిస్తున్నారు సుకుమార్‌. ఈ సినిమా పూర్తయిన తర్వాత సుక్కు, విజయ్‌ సినిమాపై కూర్చుంటారు. కోవిడ్‌ ఎఫెక్ట్‌ నుండి తగు జాగ్రత్తలు తీసుకుంటూ షూటింగ్స్‌ స్టార్ట్‌ చేస్తున్నారు దర్శక నిర్మాతలు. ఈ క్రమంలో పూరి దర్శకత్వంలో 'ఫైటర్‌' సినిమా చేస్తున్న విజయ్‌ దేవరకొండ, దాన్ని పూర్తి చేసి, మరో సినిమా కమిట్‌మెంట్‌ను పూర్తి చేసేలోపు వచ్చే ఏడాది పూర్తవుతుంది. తర్వాతే సుక్కు, విజయ్‌ దేవరకొండ క్రేజీ కాంబోలో సినిమా తెరకెక్కనుంది. 




Updated Date - 2020-09-28T17:08:09+05:30 IST