సుకుమార్‌ సర్‌... ఎదురు చూస్తున్నా

ABN , First Publish Date - 2020-09-29T06:48:31+05:30 IST

సుకుమార్‌ దర్శకత్వంలో విజయ్‌ దేవరకొండ హీరోగా ఓ సినిమా తెరకెక్కనుంది. ఫాల్కన్‌ క్రియేషన్స్‌ ఎల్‌ ఎల్‌ పి బ్యానర్‌పై నూతన నిర్మాత కేదార్‌ సెలగంశెట్టి ఈ చిత్రాన్ని నిర్మిస్తున్నారు...

సుకుమార్‌ సర్‌... ఎదురు చూస్తున్నా

సుకుమార్‌ దర్శకత్వంలో విజయ్‌ దేవరకొండ హీరోగా ఓ సినిమా తెరకెక్కనుంది. ఫాల్కన్‌ క్రియేషన్స్‌ ఎల్‌ ఎల్‌ పి బ్యానర్‌పై నూతన నిర్మాత కేదార్‌ సెలగంశెట్టి ఈ చిత్రాన్ని నిర్మిస్తున్నారు. ఆయన పుట్టినరోజు సందర్భంగా సోమవారం ఈ విషయాన్ని ప్రకటించారు. భవిష్యత్‌లో వరుసగా సినిమాలు చేయబోతున్నానని కేదార్‌ చెప్పారు. ‘‘సుకుమార్‌, విజయ్‌ దేవరకొండ నాకు ఇష్టమైన వ్యక్తులు. వీరిద్దరితో సినిమా చేయడం ఎగ్జైటింగ్‌గా ఉంది. పాన్‌ ఇండియా స్థాయిలో రూపొందనున్న ఈ చిత్రం 2022లో మొదలు కాబోతుంది. ఇతర వివరాలు త్వరలో వెల్లడిస్తా’’ అని కేదార్‌ అన్నారు. ‘‘సుకుమార్‌గారితో సినిమా అనగానే నాలో నటుడు ఎంతో ఆనందిస్తున్నాడు. నాలోని ప్రేక్షకుడు సెలబ్రేషన్స్‌ మొదలుపెట్టాడు. ఇది ప్రతి ఒక్కరికీ గుర్తుండిపోయే సినిమా అవుతుందని చెప్పగలను. సుకుమార్‌ సర్‌.. సెట్‌లో అడుగుపెట్టడానికి ఆతురతగా ఎదురుచూస్తున్నా’’ అని విజయ్‌ దేవరకొండ  సోషల్‌ మీడియా ద్వారా తెలిపారు. 

Updated Date - 2020-09-29T06:48:31+05:30 IST