`కనబడుట లేదు` టీజర్ రిలీజ్ చేసిన సుకుమార్!

ABN , First Publish Date - 2020-08-08T16:33:51+05:30 IST

సస్పెన్స్ థ్రిల్లర్‌గా తెరకెక్కిన `కనబడుట లేదు` సినిమా టీజర్‌ను టాలీవుడ్ స్టార్ డైరెక్టర్ సుకుమార్ విడుదల చేశారు.

`కనబడుట లేదు` టీజర్ రిలీజ్ చేసిన సుకుమార్!

సస్పెన్స్ థ్రిల్లర్‌గా తెరకెక్కిన `కనబడుట లేదు` సినిమా టీజర్‌ను టాలీవుడ్ స్టార్ డైరెక్టర్ సుకుమార్ విడుదల చేశారు. సుక్రాంత్ వీరెల్ల హీరోగా నటిస్తోన్న ఈ చిత్రానికి బాలరాజు దర్శకత్వం వహించారు. తాజాగా విడుదలైన టీజర్ ఆసక్తికరంగా ఉంది. మర్డర్ మిస్టరీ నేపథ్యంలో ఈ సినిమా తెరకెక్కినట్టు తెలుస్తోంది. అత్యంత ఆసక్తికరంగా టీజర్‌ను కట్ చేశారు. 


ఈ సినిమాకు మధు పొన్నాస్ సంగీతం సమకూర్చగా, సందీప్ బద్దుల సినిమాటోగ్రఫీ అందించారు. సరయు తలశిల సమర్పణలో ఎస్.ఎస్. ఫిలిమ్స్, శ్రీపాద క్రియేషన్స్, షేడ్ స్టూడియోస్ సంయుక్తంగా ఈ సినిమాను నిర్మించాయి. 
Updated Date - 2020-08-08T16:33:51+05:30 IST

Read more