బిగ్‌బాస్‌ 4 నుండి ఎలిమినేట్‌ అయిన సుజాత

ABN , First Publish Date - 2020-10-12T16:48:10+05:30 IST

నాగార్జున వ్యాఖ్యాతగా వ్యవహరిస్తోన్న రియాలిటీ షో బిగ్‌బాస్‌ 4. ఐదు వారాలు పూర్తి చేసుకున్న ఈ రియాలిటీ షో నుండి ఈ వారం జోర్‌దార్‌ సుజాత ఎలిమినేట్‌ అయ్యింది.

బిగ్‌బాస్‌ 4 నుండి ఎలిమినేట్‌ అయిన సుజాత

నాగార్జున వ్యాఖ్యాతగా వ్యవహరిస్తోన్న రియాలిటీ షో బిగ్‌బాస్‌ 4. ఐదు వారాలు పూర్తి చేసుకున్న ఈ రియాలిటీ షో నుండి ఈ వారం జోర్‌దార్‌ సుజాత ఎలిమినేట్‌ అయ్యింది. ఈ వారం బిగ్‌బాస్‌ హౌస్‌ నుండి గంగవ్వ అరోగ్య కారణాలతో బయటకు వచ్చేసిన సంగతి తెలిసిందే. ఇక ఎలిమినేషన్‌లోని 9 మంది కంటెస్టెంట్స్‌లో ముందుగా అభిజీత్‌, అఖిల్‌ శనివారమే సేఫ్‌ అయ్యారు. ఇక ఆదివారం విషయానికి వస్తే.. అరియానా, లాస్య, నోయల్‌ వరుసగా సేఫ్‌ అయ్యారు. చివరగా మోనాల్‌ సేఫ్‌ అయ్యింది. చివరగా మిగిలిన అమ్మా రాజశేఖర్‌, సుజాత గార్డెన్‌ ఏరియాలోని ఐస్‌ ముక్కలను బద్దలు కొట్టారు. అందులో ఎవిక్టెడ్‌ అని సుజాత ఫొటో రావడంతో ఆమె ఎలిమినేషన్‌ ఖరారైంది. మధ్యలో టైటిల్స్‌ ఇచ్చి దాన్ని ఇమిటేట్‌ చేస్తూ టైటిల్స్‌ చెప్పమని, టైటిల్స్‌కు తగ్గట్లు ఎవరూ సరిపోతారని హౌస్‌మేట్స్‌ అభిప్రాయంతో పాటు, ప్రేక్షకుల అభిప్రాయం ప్రకారం పోస్టర్స్‌ లుక్స్‌ను చూపించి ఆకట్టుకున్నారు. తర్వాత హోటల్‌ గేమ్‌లో అతిథులు, స్టాఫ్‌ గేమ్‌ను రివర్స్‌ చేయించి ప్రతీకారం తీర్చుకునేలాచేశారు. ఇక చివరగా ఎలిమినేట్‌ అయిన సుజాత.. వెళుతూ వెళుతూ బిగ్‌బాంబ్‌ను సోహైల్‌పై విసిరింది. బిగ్‌బాంబ్‌ ప్రకారం సోహైల్‌ కెప్టెన్‌ అయినప్పటికీ వారం రోజుల పాటు పాత్రలు కడగాల్సి ఉంటుందని నాగార్జున తెలిపారు.

Updated Date - 2020-10-12T16:48:10+05:30 IST

Read more