సుధీర్‌బాబుతో మరో సినిమా చేస్తున్న డైరెక్టర్‌

ABN , First Publish Date - 2020-11-14T22:46:34+05:30 IST

సుధీర్‌బాబు కథానాయకుడిగా డైరెక్టర్‌ మోహనకృష్ణ ఇంద్రగంటి మరో చిత్రం చేయబోతున్నారు.

సుధీర్‌బాబుతో మరో సినిమా చేస్తున్న డైరెక్టర్‌

సుధీర్‌బాబు కథానాయకుడిగా డైరెక్టర్‌ మోహనకృష్ణ ఇంద్రగంటి మరో చిత్రం చేయబోతున్నారు. 'సమ్మోహనం, వి' చిత్రాల తర్వాత వీరి కలయికలో రూపొందనున్న మూడో చిత్రమిది. ఉప్పెన ఫేమ్‌ కృతిశెట్టి ఇందులో హీరోయిన్‌గా నటిస్తుంది. గాజులపల్లి సుధీర్‌బాబు సమర్పణలో బి.మహేంద్రబాబు, కిరణ్‌ బాలపల్లి ఈ చిత్రాన్ని నిర్మిస్తున్నారు. పి.జి.విందా సినిమాటోగ్రఫీ అందిస్తోన్న ఈ చిత్రానికి వివేక్‌ సాగర్‌ సంగీత సారథ్యం వహిస్తున్నారు. రొమాంటిక్ డ్రామాగా ఈ సినిమాను రూపొందించనున్నారు. త్వరలోనే సినిమా సెట్స్‌పైకి వెళ్లనుంది. 


Updated Date - 2020-11-14T22:46:34+05:30 IST