వావ్.. సుధీర్ బాబు.. ఏం చేస్తివి ఏం చేస్తివి

ABN , First Publish Date - 2020-05-11T01:05:26+05:30 IST

తరాలు ఎన్ని మారినా.. ‘దానవీరశూరకర్ణ’ చిత్రంలోని ‘ఏమంటివి ఏమంటివి’ డైలాగ్‌కు ఉన్న క్రేజ్ మాత్రం ఏనాటికి తగ్గదు. విశ్వవిఖ్యాత నటసార్వభౌమ స్వర్గీయ నందమూరి

వావ్.. సుధీర్ బాబు.. ఏం చేస్తివి ఏం చేస్తివి

తరాలు ఎన్ని మారినా.. ‘దానవీరశూరకర్ణ’ చిత్రంలోని ‘ఏమంటివి ఏమంటివి’ డైలాగ్‌కు ఉన్న క్రేజ్ మాత్రం ఏనాటికి తగ్గదు. విశ్వవిఖ్యాత నటసార్వభౌమ స్వర్గీయ నందమూరి తారక రామారావు చెప్పిన ఈ పవర్‌ఫుల్ డైలాగ్.. రాబోయే తరాలు కూడా చెప్పుకుంటాయనడంతో అతిశయోక్తి ఉండదేమో. ఎన్ని తరాలైనా ఈ డైలాగ్‌ను ఆ ఎన్టీఆర్‌లా చెప్పడం ఎవరితరం కాదు. ఇప్పటికే ఎందరో ఈ డైలాగ్ చెప్పాలని ప్రయత్నించారు. ఆయన మనవడు యంగ్ టైగర్ ఎన్టీఆర్ కూడా ఈ డైలాగ్ చెబుతారు.. కానీ ఆయన రిథమ్‌లో మాత్రం చెప్పలేనని స్వయంగా ఎన్టీఆరే ఓ ఇంటర్వ్యూలో చెప్పారు. 


ఇప్పుడిదే డైలాగ్‌ను యంగ్ హీరో సుధీర్ బాబు చెప్పే ప్రయత్నం చేశారు. ఎన్టీఆర్ డైలాగ్ చెబుతున్న వీడియోని పక్కన పెట్టుకుని డబ్బింగ్ చెబుతున్నట్లుగా సుధీర్ ‌బాబు ఈ డైలాగ్‌ను చెప్పారు. లాక్‌డౌన్ కారణంగా ఇది ట్రై చేశా అంటూ.. సుధీర్ బాబు తను డైలాగ్ చెబుతున్న వీడియోని పోస్ట్ చేశారు. టైమింగ్‌లో చెప్పడానికి సుధీర్‌బాబు ప్రయత్నించారు కానీ.. ఆ పెద్దాయనని అనుకరించడం అంత సాధ్యం కాదని ఆయనకి కూడా తెలుసు. కానీ ఈ టైమ్‌లో ఇలాంటి ఆలోచన రావడమే చాలా గొప్ప విషయం అని సుధీర్‌బాబుపై నెటిజన్లు ప్రశంసల వర్షం కురిపిస్తున్నారు.Updated Date - 2020-05-11T01:05:26+05:30 IST