విషప్రయోగం వల్లే సుశాంత్ మరణించాడా?
ABN , First Publish Date - 2020-08-25T20:52:56+05:30 IST
బాలీవుడ్ యువ నటుడు సుశాంత్ సింగ్ రాజపుత్ కేసు సస్పెన్స్ థ్రిల్లర్ సినిమాను తలపిస్తోంది.

బాలీవుడ్ యువ నటుడు సుశాంత్ సింగ్ రాజపుత్ కేసు సస్పెన్స్ థ్రిల్లర్ సినిమాను తలపిస్తోంది. రోజుకో కొత్త మలుపు తిరుగుతూ మిస్టరీగా మారుతోంది. సుశాంత్‌పై విష ప్రయోగం జరిగిందంటూ తాజాగా మరో ఆరోపణ తెర పైకి వచ్చింది. బీజేపీ ఎంపీ సుబ్రహ్మణ్య స్వామి ట్విటర్ ద్వారా ఈ ఆరోపణ చేశారు. అలాగే జాతీయ మీడియాలో కూడా ఈ విషయం ప్రాధాన్యం సంతరించుకుంది.
`సుశాంత్ మరణం వెనకున్న హంతకుల క్రూర స్వభావం మెల్లిమెల్లిగా బయటకు వస్తోంది. సుశాంత్ కడుపులో విషం ఆనవాళ్లు లేకుండా పోవాలనే ఉద్దేశంతోనే శవపరీక్షను ఆలస్యం చేశారు. ఇందుకు బాధ్యులైన వారిని శిక్షించాల`ని సుబ్రహ్మణ్యం స్వామి ట్వీట్ చేశారు. శరీరంలో విషం ఆనవాళ్లు ఆరు గంటల సేపు మాత్రమే ఉంటాయని ఫోరెన్సిక్ ఎక్స్‌పర్ట్ ఒకరు తాజాగా వెల్లడించారు. మరణించిన 12 గంటల తర్వాత సుశాంత్ శరీరానికి పోస్ట్‌మార్టమ్ జరిగింది. ఈ నేపథ్యంలో పోస్ట్‌మార్టమ్‌లో అవకతవకలు జరిగాయని ఆరోపణలు వినిపిస్తున్నాయి.