అసత్య ప్రచారాలు ఆపండి

ABN , First Publish Date - 2020-08-25T05:23:39+05:30 IST

‘‘నాన్న ఆరోగ్యం గురించి తొలి సమాచారం పొందే వ్యక్తిని నేనే. ఆ సమాచారాన్నే నేను మీడియాతో పంచుకుంటున్నా. వైద్యులతో చర్చించిన తర్వాత నేనే అప్‌డేట్‌ ఇస్తా. దయచేసి అసత్య...

అసత్య ప్రచారాలు ఆపండి

‘‘నాన్న ఆరోగ్యం గురించి తొలి సమాచారం పొందే వ్యక్తిని నేనే. ఆ సమాచారాన్నే నేను మీడియాతో పంచుకుంటున్నా. వైద్యులతో చర్చించిన తర్వాత నేనే అప్‌డేట్‌ ఇస్తా. దయచేసి అసత్య ప్రచారాలు చేయకండి’’ అని ఎస్‌.పి.చరణ్‌ సోషల్‌ మీడియాను కోరారు. ఇటీవల చేసిన పరీక్షల్లో ఎస్‌.పి.బాలసుబ్రహ్మణ్యానికి కరోనా నెగెటివ్‌ వచ్చిందంటూ సోషల్‌ మీడియాలో వచ్చిన వార్తలపై ఓ వీడియో ద్వారా ఆయన స్పందించారు.


‘‘నాన్నగారి ఆరోగ్యానికి సంబంధించిన వైద్య బృందాన్ని సంప్రదించిన తర్వాత ఎప్పటికప్పుడు ఆ హెల్త్‌ అప్‌డేట్‌ను మీడియాతో పంచుకుంటున్నా. నాన్నగారికి కొవిడ్‌ నెగెటివ్‌ వచ్చినట్లు వార్తలు వస్తున్నాయి. కరోనా నెగెటివా? పాజిటివా? అన్న విషయం పక్కన పెడితే, నాన్న ఆరోగ్యం విషయంలో ఎలాంటి మార్పూ లేదు. ఇప్పటికీ ఆయనకు వైద్యులు వెంటిలేటర్‌, ఎక్మోసాయంతో చికిత్స అందిస్తున్నారు. ఆయన ఆరోగ్యం నిలకడగా ఉండడం ఆనందంగా ఉంది. ఇది ఇలాగే ఉంటే, ఆయన ఊపిరితిత్తులు మరింత కోలుకునే అవకాశం ఉంది’’ అని పేర్కొన్నారు. 

Updated Date - 2020-08-25T05:23:39+05:30 IST