ఇంకొన్ని రోజులు ఓపిక పడితే చాలు: గీతామాధురి

ABN , First Publish Date - 2020-04-07T00:09:47+05:30 IST

మనం ఇంట్లోనే ఉంటూ కూడా మనల్ని కాపాడుకోవడమే కాకుండా.. అందరినీ కాపాడుకునే అవకాశం దక్కిందని అన్నారు సింగర్ గీతామాధురి. ఇంకొన్ని రోజులు ఓపిక పడితే

ఇంకొన్ని రోజులు ఓపిక పడితే చాలు: గీతామాధురి

మనం ఇంట్లోనే ఉంటూ కూడా మనల్ని కాపాడుకోవడమే కాకుండా.. అందరినీ కాపాడుకునే అవకాశం దక్కిందని అన్నారు సింగర్ గీతామాధురి. ఇంకొన్ని రోజులు ఓపిక పడితే తిరిగి మళ్లీ మంచి రోజులు వస్తాయని.. అప్పుడు అందరూ హ్యాపీగా ఉండవచ్చని ఆమె ఓ వీడియో ద్వారా సందేశమిచ్చారు.


‘‘హాయ్.. అందరికీ నమస్కారం. అందరూ ఇంటిపట్టునే ఉండండి.. సురక్షితంగా ఉండండి. నేను ఇంటిలోనే ఉంటున్నాను. మీరు కూడా ఇంటిలోనే ఉండండి. ఏవైనా అవసరాల కోసం బయటికి వెళ్లినప్పుడు ఒకేసారి అన్నీ తెచ్చుకోండి. అవి తెచ్చుకునేటప్పుడు కూడా జాగ్రత్తగా ఉండండి. అన్నీ, పాల ప్యాకెట్లతో సహా అన్నీ శానిటైజ్ చేయండి. చేతులు కూడా ఎప్పటి కప్పుడు శానిటైజర్‌తో క్లీన్ చేసుకోండి. అస్తమానం చేతులని నోటి దగ్గర, ముక్కు, కళ్ల దగ్గర పెట్టుకోకండి. మనం ఇంట్లో ఉంటూ కూడా మనల్ని కాపాడుకోవడమే కాకుండా.. అందరినీ కాపాడుకునే అవకాశం దక్కింది. ఇంకొన్ని రోజులు ఓపిక పడితే.. ప్రస్తుత పరిస్థితులన్నీ చక్కబడతాయి. అందరూ సుఖంగా ఉండే రోజులు మళ్లీ వచ్చేస్తాయి. దయచేసి అందరూ ఇంట్లోనే ఉండండి..’’ అని గీతామాధురి తెలిపారు.

Updated Date - 2020-04-07T00:09:47+05:30 IST