ఇది మనకోసమే అని అందరూ భావించండి: రేణు దేశాయ్

ABN , First Publish Date - 2020-04-06T00:55:02+05:30 IST

కరోనా మహమ్మారి నుంచి మనల్ని మనం రక్షించుకోవడానికి ప్రభుత్వాలు లాక్‌డౌన్‌ని ప్రకటించిన విషయం తెలిసిందే. అయినా కొందరు లాక్‌డౌన్‌ని పాటించకుండా బయట

ఇది మనకోసమే అని అందరూ భావించండి: రేణు దేశాయ్

కరోనా మహమ్మారి నుంచి మనల్ని మనం రక్షించుకోవడానికి ప్రభుత్వాలు లాక్‌డౌన్‌ని ప్రకటించిన విషయం తెలిసిందే. అయినా కొందరు లాక్‌డౌన్‌ని పాటించకుండా బయట తిరుగుతున్నారని, ఇది చాలా ప్రమాదం అని అన్నారు నటి రేణు దేశాయ్. ఈ లాక్‌డౌన్ మన రక్షణ కోసం, మన కుటుంబ రక్షణ కోసం.. మన పిల్లల కోసం. దయచేసి ఇంట్లోనే కూర్చోండి. బయటికి వెళ్లవద్దు అని ఆమె ఏబీఎన్ ఆంధ్రజ్యోతి ద్వారా ప్రజలకు తెలియజేశారు. 


‘‘నాకు తెలుసు. మనం అందరం ఎలాంటి పరిస్థితుల్లో ఉన్నామో. ప్రపంచం మొత్తం ఇప్పుడు కరోనా సంక్షోభాన్ని ఎదుర్కొంటుంది. కానీ తప్పదు.. ఇంకొన్ని రోజులు ఓపిక పట్టండి. ఇంట్లోనే ఉండండి. నేను నా బాల్కనీ నుంచి చూస్తున్నాను. చాలా మంది బయట తిరుగుతున్నారు. బస్‌లు కనిపిస్తున్నాయి. టూ వీలర్స్, ఫోర్ వీలర్స్ అన్నీ తిరుగుతూనే ఉన్నాయి. ఈ లాక్‌డౌన్ మన రక్షణ కోసం, మన కుటుంబ రక్షణ కోసం.. మన పిల్లల కోసం. దయచేసి ఇంట్లోనే కూర్చోండి. బయటికి వెళ్లవద్దు. ఒక్కసారి అనుకుంటే ఏదైనా చేయగలం. నాకు తెలుసు ఇంట్లో కూర్చోవడం ఎంత కష్టమో. పనులు మానుకుని ఇంట్లో కూర్చుని ఉండటం అంత ఈజీ కాదు. కానీ ఇది మనకోసమే అని అందరూ భావించండి. ఒకవేళ బయటికి వెళితే.. ఎవరికి కరోనా వైరస్ ఉందో, ఎవరికి లేదో తెలియదు. ఒకవేళ వైరస్ సోకిన వ్యక్తికి మీరు దగ్గరవడం వల్ల మీకు కూడా ఆ వైరస్ అంటుకుంటుంది. మీ ద్వారా మీ ఇంటిలోని వారికి.. ఇలా వ్యాప్తి చెందుతుంది. ఇది చాలా ప్రమాదం. అందుకే అందరూ ఇంట్లోనే ఉండండి. ఇంకొన్ని రోజుల వరకు బాధ్యతగా ఉండండి. ఇది రిలాక్స్ టైమ్ అనుకుని పాజిటివ్ థింకింగ్‌ని ఏర్పరచుకోండి. మీ మీద మీకు నమ్మకం ఏర్పరచుకోండి..’’ అని రేణు దేశాయ్ పేర్కొన్నారు.

Updated Date - 2020-04-06T00:55:02+05:30 IST